క్రిస్పీ ఫిష్‌ ఫింగర్స్‌

కావాల్సినవి: బోన్‌లెస్‌ ఫిష్‌- 250 గ్రా., కారం, మిరియాల పొడి, వెల్లుల్లి ముద్ద, మైదాపిండి- అర చెంచా చొప్పున, వాము- పావు చెంచా, నిమ్మరసం- చెంచా, బ్రెడ్‌ పొడి- కప్పు.

Updated : 01 Aug 2021 04:43 IST

కావాల్సినవి: బోన్‌లెస్‌ ఫిష్‌- 250 గ్రా., కారం, మిరియాల పొడి, వెల్లుల్లి ముద్ద, మైదాపిండి- అర చెంచా చొప్పున, వాము- పావు చెంచా, నిమ్మరసం- చెంచా, బ్రెడ్‌ పొడి- కప్పు.

తయారీ: చేపలను శుభ్రంగా కడిగి కావాల్సిన ఆకారంలో కోసి గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో కారం, మిరియాల పొడి, వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, ఆవాల నూనె, వాము, తగినంత   ఉప్పు వేసి చేప ముక్కలకు బాగా పట్టించాలి. ఇప్పుడు వీటిని 15 నుంచి 20 నిమిషాల వరకు ఫ్రిజ్‌లో పెట్టాలి.

పొయ్యి వెలిగించి నాన్‌స్టిక్‌ కడాయి పెట్టి నూనె వేయాలి. చేప ముక్కలను వేసి మంటను మధ్యస్థంగా పెట్టి నాలుగు నుంచి ఐదు నిమిషాలు గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు వచ్చే వరకు వేగనివ్వాలి. వేగిన క్రిస్పీ ఫిష్‌ ఫింగర్స్‌ను వేడి వేడిగా టొమాటో సాస్‌తో వడ్డించుకోవాలి. 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని