చికెన్‌ చిన్నముక్కలుగా...

బజారు నుంచి చికెన్‌ తెచ్చాక ఒక్కోసారి ముక్కలు మరీ పెద్దగా ఉంటాయి. వాటిని చాకుతో కోయడం కాస్త కష్టమే. ఎముకలుంటే మరీ కష్టం. చాకు మీదకొచ్చి, మన చేతివేళ్లే తెగే ప్రమాదం ఉంది. మీకూ అలాంటి సందర్భాలు ఉన్నాయా? అయితే మీ పౌల్ట్రీషియర్స్‌

Published : 26 Jun 2022 00:40 IST

బజారు నుంచి చికెన్‌ తెచ్చాక ఒక్కోసారి ముక్కలు మరీ పెద్దగా ఉంటాయి. వాటిని చాకుతో కోయడం కాస్త కష్టమే. ఎముకలుంటే మరీ కష్టం. చాకు మీదకొచ్చి, మన చేతివేళ్లే తెగే ప్రమాదం ఉంది. మీకూ అలాంటి సందర్భాలు ఉన్నాయా? అయితే మీ పౌల్ట్రీషియర్స్‌ పరికరాన్ని దగ్గర పెట్టుకోవాల్సిందే. ఒకరకంగా చెప్పాలంటే ఇది వంటింటి కత్తెర అన్నమాట. దీంతో చికెన్‌ని చిన్నముక్కలుగా, కావాల్సిన పద్ధతిలో కొయ్యడం తేలిక. చేతి నుంచి కత్తి జారే ప్రసక్తి ఉండదు. పని తేలిక అవుతుంది. అలాగే చేపల పొలుసులు తీయడం, మొప్పలు కత్తిరించడం కూడా చాలా సులభం. ఒక్క మాంసాహారానికే కాదు మునక్కాడలు వంటివీ కోయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని