గరిటెకూ ఉందో స్టాండ్‌

ఉడుకుతున్న అన్నాన్ని కలిపి గరిటెను పక్కన గ్యాస్‌ స్టవ్‌ మీదే పెట్టేస్తాం. మిగతా బర్నర్‌ల మీద పాత్రలుంటే చెంచా ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తాం. వంటబండ మీద పెట్టాలంటే మనసొప్పదు. ఏదో పాత్ర మూత మీద పెట్టేస్తాం. అన్నం, కూర... టిఫిన్‌... అన్నీ ఒకేసారి వండుతున్నప్పుడు అన్నం, కూరలను కలిపిన గరిటెలు ఎక్కడ పెట్టాలి.

Published : 06 Feb 2022 00:43 IST

ఉడుకుతున్న అన్నాన్ని కలిపి గరిటెను పక్కన గ్యాస్‌ స్టవ్‌ మీదే పెట్టేస్తాం. మిగతా బర్నర్‌ల మీద పాత్రలుంటే చెంచా ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తాం. వంటబండ మీద పెట్టాలంటే మనసొప్పదు. ఏదో పాత్ర మూత మీద పెట్టేస్తాం. అన్నం, కూర... టిఫిన్‌... అన్నీ ఒకేసారి వండుతున్నప్పుడు అన్నం, కూరలను కలిపిన గరిటెలు ఎక్కడ పెట్టాలి.... అందుకో ఉపాయం ఆలోచించారు తయారీదారులు. గరిటె కింద పెట్టకుండా ఎంచక్కా ఈ ‘స్పూన్‌ రెస్ట్‌ హీట్‌ రెసిస్టెంట్‌ కిచెన్‌ యుటెన్సిల్‌ స్పాట్యూలా హోల్డర్‌’ను వాడుకోవచ్చు.
సిలికాన్‌తో తయారైన ఇవి మృదువుగా ఉంటాయి. అవెన్‌, ఫ్రిజ్‌లోనూ వాడుకోవచ్చు. అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలనూ తట్టుకుంటాయి. శుభ్రం చేయడమూ తేలికే.
ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నారింజ.... ఇలా పలు ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవుతున్నాయి. గచ్చుకు గరిటె ఆనకుండా ఎంచక్కా వీటిలో పెట్టేసుకోవచ్చు. అన్నం, కూర చెంచాలను ఎక్కడపడితే అక్కడ పెట్టడం వల్ల ఆ ప్రాంతమంతా చూడటానికి బాగోదు. ఈ పరికరం ద్వారా ఆ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు.
ఎంతగానో ఉపయోగపడే దీన్ని మీరూ వాడుకోవడమే కాదు...  ఇష్టమైన వారికి బహుమతిగానూ ఇవ్వొచ్చు. బాగుంది కదూ...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని