అరికాళ్ల మంటలా..

చురుగ్గా లేకపోవడం, వ్యాధినిరోధక శక్తి లోపించడం.. అరికాళ్లు మంటగా అనిపించడం ఇవన్నీ బి12 విటమిన్‌ లోపించినప్పుడు కనిపించే లక్షణాలు. అందుకే బి12ని సమృద్ధిగా అందించే ఆహారం గురించి తెలుసుకుందాం..  

Published : 21 Aug 2022 01:31 IST


చురుగ్గా లేకపోవడం, వ్యాధినిరోధక శక్తి లోపించడం.. అరికాళ్లు మంటగా అనిపించడం ఇవన్నీ బి12 విటమిన్‌ లోపించినప్పుడు కనిపించే లక్షణాలు. అందుకే బి12ని సమృద్ధిగా అందించే ఆహారం గురించి తెలుసుకుందాం..  

* మటన్‌ లేదా చికెన్‌ తెచ్చినప్పుడు అందులో లివర్‌ కనిపిస్తే కొంతమందికి నచ్చదు. తీసి పక్కన పెట్టేస్తుంటారు. కానీ లివర్‌.. ముఖ్యంగా మటన్‌లోని లివర్‌ మన రోజువారీ అవసరాలకు సరిపడే బి12ని అందిస్తుంది.
* చిరుధాన్యాలన్నింటినీ  కలిపి చేసిన గ్రనోలాబార్లు మనకు తేలిగ్గానే దొరుకుతాయి. వారంలో ఒకటి రెండు సార్లు తిన్నారంటే... శరీరానికి కావల్సిన పీˆచుతో పాటు బి12 లోపం రాకుండా ఉంటుంది.
* పాలు, పెరుగు, చీజ్‌ అన్నింటి నుంచీ ఈ కీలకమైన విటమిన్‌ అందుతుంది. ఒక  చీజ్‌ స్లైస్‌ నుంచి మన రోజువారీ అవసరాలకు కావాల్సిన 28 శాతం బి12 అందుతుంది.
* రోజులో రెండు గుడ్లు తింటే ఈ విటమిన్‌ లోపానికి చెక్‌ పెట్టొచ్చు. వాస్తవానికి తెల్లసొనలో కన్నా... పచ్చసొనలో ఎక్కువగా బి12 ఉంటుంది. గుడ్డుని మొత్తంగా తినడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
వారంలో రెండు లేదా మూడుసార్లు చేపల్ని తింటే శరీరానికి కావాల్సిన ఒమెగా ఆమ్లాలతోపాటు.. ఈ విటమిన్‌ కూడా అందుతుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని