ఇంట్లోనే వెన్న చేద్దామిలా!

ఎండాకాలం వస్తుందంటే పెరుగు, మజ్జిగ వినియోగం పెరుగుతుంది. పాత రోజుల్లో అయితే... మజ్జిగని ఇంట్లో చిలికేవారు. దీనికోసం కవ్వాలుండేవి. ఇప్పుడైతే మజ్జిగ, వెన్న, పెరుగు అన్నీ రెడీమేడ్‌గానే తెచ్చుకుంటున్నాం.

Published : 26 Feb 2023 00:13 IST

ఎండాకాలం వస్తుందంటే పెరుగు, మజ్జిగ వినియోగం పెరుగుతుంది. పాత రోజుల్లో అయితే... మజ్జిగని ఇంట్లో చిలికేవారు. దీనికోసం కవ్వాలుండేవి. ఇప్పుడైతే మజ్జిగ, వెన్న, పెరుగు అన్నీ రెడీమేడ్‌గానే తెచ్చుకుంటున్నాం. కానీ పిల్లలకి ఇవన్నీ తెలియాలన్నా, ఇంట్లోనే కమ్మని వెన్నని తయారు చేసుకోవాలన్నా ఈ పరికరం మీకు సహకరిస్తుంది. ఇది బటర్‌ చర్నర్‌. కిందున్న గాజు సీసాలో పెరుగు వేసి మూత బిగించి ఆ పిడిని తిప్పితే చాలు. నాలుగైదు నిమిషాలకు పాల నుంచి తాజా వెన్న వేరవుతుంది. వంటల్లోకి, పిల్లలకు పెట్టడానికి బాగుంటుంది. పైగా ఇలా చిలకడాన్ని పిల్లలు ఆస్వాదిస్తారు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని