పచ్చి బఠాణీలు.. మెచ్చు గుణాలు

తాజా బఠాణీలు.. ఆకుపచ్చ ముత్యాల్లా ఎంత అందంగా ఉంటాయి కదూ! చూస్తుంటేనే నోట్లో వేసుకోబుద్ధేస్తుంది.

Updated : 26 Nov 2023 03:28 IST

తాజా బఠాణీలు.. ఆకుపచ్చ ముత్యాల్లా ఎంత అందంగా ఉంటాయి కదూ! చూస్తుంటేనే నోట్లో వేసుకోబుద్ధేస్తుంది. బఠాణీలను క్యాలీఫ్లవర్‌, క్యాబేజ్‌, బంగాళదుంప, క్యారెట్‌.. ఇలా దేనితో కలిపి వండినా వాటి రుచి రెట్టింపవుతుంది. బిర్యానీ, కిచిడీల్లో ఇవి గనుక లేకపోతే.. పెద్ద లోటుగానే ఉంటుంది. వీటితో స్వీట్లు, హాట్లు కూడా చేయొచ్చు. సూప్‌, సలాడ్‌ రూపంలోనూ సేవించవచ్చు. బఠాణీల్లో ఎన్ని సుగుణాలున్నాయంటే.. ఇవి

పచ్చి బఠాణీలు ఎర్రరక్త కణాలు వృద్ధిచెందడంలో, శరీరం అంతటికీ ప్రాణవాయువును అందజేయడంలో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తాయి.

బఠాణీలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తరచుగా బఠాÈణీలు తినేవారికి క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువ. వీటిలో ఉన్న సెపోనిన్స్‌ ద్రవ్యాలు క్యాన్సర్‌ నుంచి రక్షణనిస్తాయి. బఠాణీల్లో ఉన్న యాంటీబాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ గుణాలు శరీరంలో చేరిన సూక్ష్మ క్రిములను నశింపచేస్తాయి. వీటిల్లో ఉండే కెరొటినాయిడ్స్‌, జిక్సాందౌథిన్లు కళ్లకు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడతాయి. యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్లను సైతం నిరోధిస్తాయని పరిశోధనల్లో తేలింది. పీచు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌, భాస్వరం, సోడియం, సెలెనియం, క్యాల్షియం, ఐరన్‌, జింక్‌, విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయి. మాంసాహారం తినని వాళ్లకి మంచి పోషకాహారం. ఇంత మేలు చేసే బఠాణీలను విస్మరిస్తే ఎలా? తరచూ ఏదో రూపంలో తీసుకుందాం. ఆరోగ్యంగా ఉందాం. కానీ అవసరమైన కంటే ఎక్కువగా తింటే మాత్రం అనర్థమేనండోయ్‌!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు