అరటిపండు కోసం మాజిక్‌ స్లైసర్‌!

పిల్లలకు మహా ఇష్టమైంది కస్టర్డ్‌. అందులో అరటి పండు ముక్కలు వేస్తే.. ఆ రుచే వేరు.

Updated : 26 Nov 2023 03:33 IST

 పిల్లలకు మహా ఇష్టమైంది కస్టర్డ్‌. అందులో అరటి పండు ముక్కలు వేస్తే.. ఆ రుచే వేరు. ఎంత జాగ్రత్తగా కోసినా.. అన్నీ సమానంగా రావు. పైగా ఎక్కువ మొత్తంలో అంటే.. చాలా సమయం పడుతుంది. అదే ‘బనానా మాజిక్‌ స్లైసర్‌’ గనుక ఉంటే వేగంగా, సన్నగా, సమానంగా కట్‌ చేసేయొచ్చు. పండు మీద స్లైసర్‌తో ప్రెస్‌ చేస్తే సరిపోతుంది. ఎంత సులువు కదూ! ఈ సాధనంతో దేవుడికి నైవేద్యంగా పెట్టిన అరటిపండును కూడా తేలిగ్గా చిన్నగా ముక్కలు కోసి ప్రసాదంగా పంచేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని