చర్మం పగలకుండా ఇవి తాగండి!

చలికాలం చర్మం పగలడం, పొడిబారడం సాధారణం కదూ! ఇలాంటి ఇబ్బంది కలగకుండా.. మీ స్కిన్‌ మెరుస్తూ ఉండాలంటే.. ఈ డ్రింక్స్‌ తాగండి..

Published : 07 Jan 2024 00:57 IST

చలికాలం చర్మం పగలడం, పొడిబారడం సాధారణం కదూ! ఇలాంటి ఇబ్బంది కలగకుండా.. మీ స్కిన్‌ మెరుస్తూ ఉండాలంటే.. ఈ డ్రింక్స్‌ తాగండి..

నిమ్మకాయ నీళ్లు

ఉదయం లేవగానే గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే.. జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. చర్మానికి మెరుపు వస్తుంది.

ధనియా, అల్లం

అలసట పేరుతోనో, హుషారు కోసమో రోజులో అనేకసార్లు టీ, కాఫీలు తాగుతుంటాం. వాటికి బదులు  అల్లం, ధనియాల కషాయం తాగితే.. దద్దుర్లు రావు. చర్మం నిగారిస్తుంది.

కీరదోస

కీరదోస జ్యూస్‌ తాగడం అలవాటు చేసుకుంటే.. ఇక మాయిశ్చరైజర్లతో పనే ఉండదు. చర్మానికి మెరుపు వస్తుంది.

బంగాళాబంతి, పుదీనా, శొంఠి

వీటిల్లో దేన్నయినా నీళ్లలో మరిగించి, చల్లారాక తాగితే.. ఉత్తేజం కలగడమే కాదు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

గ్రీన్‌ టీ

దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం పొడిబారక, నేవళంగా ఉంటుంది.

అలోవెరా జ్యూస్‌

విటమిన్లు, ఖనిజాలు ఉన్న అలోవెరా చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది.

కొబ్బరి నీళ్లు

వేసవిలోనే కాదు, ఈ కాలంలో కూడా మంచిది. రసాయనాల కూల్‌డ్రింక్స్‌కు బదులు కొబ్బరినీళ్లు తాగితే.. పోషకాలు, ఖనిజాలూ అంది చర్మం కాంతితో మెరుస్తుంది.

నీళ్లు

ఇక నీళ్ల గురించి చెప్పాల్సిందేముంది.. ఎంత ఎక్కువ తాగితే చర్మం అంత  ఆరోగ్యంగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని