ఐదు రొట్టెలు ఒకేసారి..

మెత్తగా పొరలు పొరలుగా ఉండే చపాతీలు బంగాళదుంప కూరతో తింటే ఎంత రుచిగా ఉంటాయో కదూ! కానీ చేయాలంటే మాత్రం చాలానే కష్టపడాలి. ‘ఇంత శ్రమ లేకుండా ఐదారు రొట్టెలు ఒకేసారి చేస్తే సూపర్‌గా ఉంటుందిగా!’ అనుకుందో ఇల్లాలు.

Published : 04 Feb 2024 00:04 IST

మెత్తగా పొరలు పొరలుగా ఉండే చపాతీలు బంగాళదుంప కూరతో తింటే ఎంత రుచిగా ఉంటాయో కదూ! కానీ చేయాలంటే మాత్రం చాలానే కష్టపడాలి. ‘ఇంత శ్రమ లేకుండా ఐదారు రొట్టెలు ఒకేసారి చేస్తే సూపర్‌గా ఉంటుందిగా!’ అనుకుందో ఇల్లాలు. ఆ ఊహను అలా వదిలేయలేదామె. దాన్ని ఎంచక్కా నిజం చేసి చూపింది. ఎలాగంటారా.. మనమంతా పిండిని చిన్న చిన్న భాగాలుగా తీసుకుని.. ఒక్కో దాన్నీ చపాతీగా ఒత్తుకుంటాం కదా! అందుకు భిన్నంగా ఐదు భాగాలను అరచేత్తో కాస్త ఒత్తి.. ఒకదాని మీద ఇంకొకటి చొప్పున పేర్చిందామె. ప్రతిదాని మధ్యలో కాస్త పొడిపిండి చల్లి.. రోల్‌ చేసింది. అంతే.. ఐదు రొట్టెలు ఒక్కసారితో పూర్తయి పోయాయి. పొడిపిండి వల్ల ఒకదానికొకటి అంటుకోలేదు. ‘ఆహా ఏం తెలివి!’ అనకుండా ఉండలేం కదూ! ‘హ్యాక్‌ ఇట్‌ విత్‌ మేఘ’ పేరుతో ఇన్‌స్టాలో పోస్టయిన ఈ వీడియో వైరలైంది. దీనికి ఇప్పటిదాకా 70 లక్షల వ్యూస్‌, లక్షన్నరకు పైగా లైక్స్‌ వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని