జంతికలు కరకరలాడేలా రావాలంటే..

జంతికలంటే చాలా ఇష్టం. నేను చేస్తుంటే మెత్తగా వస్తున్నాయి. ఒక్కోసారి మరీ వేగిపోయి... నములుతుంటే నోరు నెప్పెడుతోంది.

Published : 08 Jan 2023 00:34 IST

జంతికలంటే చాలా ఇష్టం. నేను చేస్తుంటే మెత్తగా వస్తున్నాయి. ఒక్కోసారి మరీ వేగిపోయి... నములుతుంటే నోరు నెప్పెడుతోంది. గుల్లగా, కరకరలాడే జంతికలు రావడానికి ఏవైనా చిట్కాలు ఉంటాయా?

* జంతికలు కరకరలాడే రావడానికి చాలా పద్ధతులు ఉంటాయి. అందులో ఒక పద్ధతి ఇది. కప్పు బియ్యప్పిండికి... రెండు కప్పుల సెనగపిండి తీసుకుని ఉండల్లేకుండా జల్లెడ పట్టుకోవాలి. రెండు చెంచాల వెన్నపూసని కాచి వేడిచేసి పిండిలో వెయ్యాలి. జంతికల పిండిని చన్నీళ్లతో కాక గోరువెచ్చని నీళ్లతో కలిపి చూడండి. పిండిని మరీ గట్టిగా, మరీ జారుగా కాకుండా కలపాలి. అలాగే ముద్ద కలిపిన తర్వాత తడి వస్త్రంతో పైన కప్పేయాలి. ఓ పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాతే ఆ పిండిని వాడాలి. అలాగే వేయించేటప్పుడు జంతికలని ఎక్కువ సేపు నూనెలో ఉంచొద్దు. అలా ఉంచితే జంతికలు గట్టిగా ఉంటాయి. రంగుమారగానే జంతికల్ని బయటకు తీసేయాలి. జంతికలు మరీ లావుగా ఉండే గొట్టం నుంచి వేయొద్దు. అవి సరిగా వేగక మెత్తగా ఉంటాయి. పిండిలో చెంచా వాము వేసి చూడండి. చాలా రుచిగా ఉంటాయి. అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి

ప్రశాంత్‌ కుమార్‌ నీరుండి, యూఎస్‌ఏ, బిర్యానీ బిస్ట్రో, కాలిఫోర్నియా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని