గంటలోనే మారిన ఏపీపీ పోస్టింగు ఉత్తర్వులు

రాష్ట్రవ్యాప్తంగా పలువురు సహాయ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను (ఏపీపీ) బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేసిన గంటలోనే నలుగురి పోస్టింగ్‌ మారుస్తూ మరో ఉత్తర్వు వచ్చింది. ఇది న్యాయవర్గాల్లో

Published : 02 Jul 2022 05:17 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలువురు సహాయ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను (ఏపీపీ) బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేసిన గంటలోనే నలుగురి పోస్టింగ్‌ మారుస్తూ మరో ఉత్తర్వు వచ్చింది. ఇది న్యాయవర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఒత్తిళ్లే ఇందుకు కారణమయ్యాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న ఏపీపీలను బదిలీచేస్తూ.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌ (ఎఫ్‌ఏసీ) జి.సత్యప్రభాకరరావు శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. జోన్‌-1 పరిధిలో 15, జోన్‌-2లో 27, జోన్‌-3లో 10, జోన్‌-4లో 26 మంది ఏపీపీలను బదిలీ చేశారు. మళ్లీ గంటలోనే సవరణ ఉత్తర్వులు వెలువడ్డాయి.  జోన్‌-2 పరిధిలోని చింతలపూడి జ్యుడిషియల్‌ మొదటి తరగతి మేజిస్ట్రేట్‌ (జేఎఫ్‌సీఎం) కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న కె.సుజాతను ఏజేఎఫ్‌సీఎం కైకలూరుకు తొలుత బదిలీ చేశారు. గంటలోనే ఆమెను భీమవరం రెండో ఏజేఎఫ్‌సీఎం కోర్టుకు బదిలీ చేస్తూ సవరణ ఉత్తర్వులిచ్చారు. నందిగామ జేఎఫ్‌సీఎం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న ఎండీ సిద్ధిఖీ అహ్మద్‌ను తిరువూరు ఏజేఎఫ్‌సీఎం కోర్టుకు బదిలీ చేసి, తర్వాత విజయవాడలోని మూడో ఎంఎం మున్సిపల్‌ కోర్టుకు బదిలీ చేశారు. తిరువూరు ఏజేఎఫ్‌సీఎం కోర్టులో ఏపీపీగా పనిచేస్తున్న జీఈ రాధికను.. విజయవాడలోని మూడో ఎంఎం మున్సిపల్‌ కోర్టుకు బదిలీ చేసి, తర్వాత కైకలూరు ఏజేఎఫ్‌సీఎం కోర్టులో పోస్టింగ్‌ ఇచ్చారు. జోన్‌-4 పరిధిలోని అనంతపురం ప్రత్యేక మొబైల్‌ కోర్టు(పీసీఆర్‌)లో ఏపీపీగా పనిచేస్తున్న ఎస్‌.హేమలతను జమ్మలమడుగు జేఎఫ్‌సీఎం కోర్టుకు బదిలీ చేశారు. కాసేపటికి.. ఆమెను గుంతకల్లు జేఎఫ్‌సీఎం కోర్టుకు బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని