చారిత్రక సంపదపై నిర్లక్ష్యం

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలోని దనంబోడులో ఉన్న బుద్ధుడి కాలం నాటి ఆనవాళ్లు, బౌద్ధ స్తూపం పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. మూడేళ్లుగా వీటిని పట్టించుకున్న వారే లేరు. పిచ్చిమొక్కలతో ఆ ప్రాంతం

Published : 04 Jul 2022 04:58 IST

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలోని దనంబోడులో ఉన్న బుద్ధుడి కాలం నాటి ఆనవాళ్లు, బౌద్ధ స్తూపం పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. మూడేళ్లుగా వీటిని పట్టించుకున్న వారే లేరు. పిచ్చిమొక్కలతో ఆ ప్రాంతం అధ్వానంగా తయారైంది. స్తూపంపై ఉన్న మట్టి వర్షాలకు కరిగి చుట్టూ ఉన్న పాలరాతి శిల్పాలు రంగు మారి రూపు కోల్పోతున్నాయి. ఆకతాయిలు స్తూపాలపై వ్యక్తుల పేర్లు చెక్కుతున్నారు. లోపలికి ప్రవేశించి మద్యం సేవించడం, పేకాట ఆడుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు.

- ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని