బయోడీజిల్‌ తయారీ ప్లాంట్లలో తనిఖీలు

బయోడీజిల్‌ పేరుతో నకిలీ పెట్రో ఉత్పత్తులు తయారు చేస్తున్న ప్లాంట్లపై రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Published : 06 Aug 2022 03:55 IST

54,640 లీటర్ల క్రూడ్‌ ఆయిల్‌ స్వాధీనం

ఉంగుటూరు, న్యూస్‌టుడే: బయోడీజిల్‌ పేరుతో నకిలీ పెట్రో ఉత్పత్తులు తయారు చేస్తున్న ప్లాంట్లపై రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడులో ఏర్పాటు చేస్తున్న బయోడీజిల్‌ తయారీ ప్లాంట్‌పై విజిలెన్స్‌, జీఎస్టీ, పౌర సరఫరాలు, లీగల్‌ మెట్రాలజీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. హైదరాబాద్‌లో బయోడీజిల్‌ తయారు చేస్తున్న ఓ ల్యాబొరేటరీస్‌కు చెందిన జాలిం శ్రీనివాస్‌ అదే కంపెనీ పేరుతో నల్లమాడులో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు జిల్లాస్థాయిలో ఇంకా అనుమతులు రాలేదు. ఈ నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో 54,640 లీటర్ల క్రూడ్‌ ఆయిల్‌ ఉన్నట్లు గుర్తించి పరీక్షల నిమిత్తం నమూనాలు సేకరించారు. మొత్తం ఆయిల్‌ను సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు సివిల్‌ సప్లై ఏఎస్‌వో లక్ష్మణ్‌బాబు తెలిపారు. వాటికి సంబంధించిన దస్త్రాలు హైదరాబాద్‌లో ఉన్నాయని జాలిం శ్రీనివాస్‌ చెప్పడంతో మూడు రోజుల్లో నివేదించాలని అధికారులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని