క్వార్ట్‌జైట్‌ తవ్వకాలకు అనుమతులు వద్దు

‘క్వార్ట్‌జైట్‌ తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దు. కొందరి ప్రయోజనాల కోసం పది, పదిహేను గ్రామాలను ప్రమాదంలోకి నెట్టవద్దు’ అని బాధిత గ్రామాల ప్రజలు కోరారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం

Published : 19 Aug 2022 05:08 IST

ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టం చేసిన ప్రజలు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: ‘క్వార్ట్‌జైట్‌ తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దు. కొందరి ప్రయోజనాల కోసం పది, పదిహేను గ్రామాలను ప్రమాదంలోకి నెట్టవద్దు’ అని బాధిత గ్రామాల ప్రజలు కోరారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం దాలివలస సర్వే నంబరు 182, మర్రివలస సర్వే నంబరు 01, పిండ్రంగి సర్వే నం 284, 298లో 12.14 హెక్టార్లలో 1.82 లక్షల మెట్రిక్‌ టన్నుల క్వార్ట్‌జైట్‌ ఖనిజం తవ్వకాల కోసం దాలివలస ఉన్నత పాఠశాలలో గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. డీఆర్వో వెంకటరమణ, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ (విశాఖపట్నం) సుదర్శన్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి దాలివలస, మర్రివలస, పిండ్రంగి, మెరక రామచంద్రపురం, రావాలమ్మపాలెం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. గుత్తేదారులు ఎం.ఎ.ఆర్‌.కుమారి, విజయలక్ష్మి తరఫున వివరాలను ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి అధికారి సుదర్శన్‌ చదివి వినిపించారు. తవ్వకాలకు అనుమతులు ఇస్తే పర్యావరణానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో ఒక కుటుంబానికి, సంస్థ ప్రయోజనానికి పది నుంచి 15 గ్రామాలకు చెందిన ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. గవరపాలెంలో ఇదేరోజు ప్రజాభిప్రాయ సేకరణను డీఆర్వో వెంకటరమణ నిర్వహించారు. పిండ్రంగి సర్వే నంబరు 562లో 40 ఎకరాల్లో క్వార్జ్‌జైట్‌ తవ్వకాలకు విజయలక్ష్మి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో పిండ్రంగికి చెందిన గొలగాని రమణ, గండి నాయునిబాబుతోపాటు పలువురు తవ్వకాలను వ్యతిరేకించారు. గవరపాలెం ఎంపీటీసీ సభ్యుడు సూర్యనారాయణ ఖనిజాన్ని తవ్వుకోవచ్చని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని