మౌలిక వసతుల కల్పనలో రాజీ వద్దు

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సమయానికల్లా మౌలిక వసతులు కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణంపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు

Published : 23 Sep 2022 03:39 IST

గృహ నిర్మాణంపై సమీక్షలో సీఎం

ఈనాడు, అమరావతి: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సమయానికల్లా మౌలిక వసతులు కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణంపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ‘ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువులోగా చేరుకోవాలి. గృహ నిర్మాణంలో వెనుకబడిన జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యే నాటికి కాలనీల్లో కాలువలు, విద్యుత్తు, తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలి. కాలనీల పరంగా ప్రాధాన్య పనులపై స్పష్టమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి’ అని అధికారులను సీఎం ఆదేశించారు. 2022-23లో గృహ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు రూ.4,318 కోట్ల విలువైన పనుల్ని చేశామని సీఎంకు అధికారులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు