కిట్టు చూడు.. కిట్టందం చూడు!
విద్యా కానుక కిట్లు అంటే నెలా, రెండు నెలలకే చిరిగిపోతున్న బ్యాగులు, బూట్లు.. అలాంటి వాటి కొనుగోళ్లలోనూ ఎన్ని సిత్రాలో! గత ఏడాది మిగిలి పోయిన వాటిని తర్వాతి ఏడాది వినియోగించుకుంటామని ప్రకటించిన సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) వచ్చే ఏడాదికి కొనే వాటిలో ఆ మేరకు ఎందుకు తగ్గించలేదో స్పష్టత ఇవ్వలేదు.
పాతవీ వినియోగిస్తామన్నప్పుడు మళ్లీ 5% ఎక్కువ ఎందుకు కొనడం?
ప్రకటనల్లో ఒకలా.. ఇప్పుడు మరోలా..
ఈనాడు, అమరావతి: విద్యా కానుక కిట్లు అంటే నెలా, రెండు నెలలకే చిరిగిపోతున్న బ్యాగులు, బూట్లు.. అలాంటి వాటి కొనుగోళ్లలోనూ ఎన్ని సిత్రాలో! గత ఏడాది మిగిలి పోయిన వాటిని తర్వాతి ఏడాది వినియోగించుకుంటామని ప్రకటించిన సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) వచ్చే ఏడాదికి కొనే వాటిలో ఆ మేరకు ఎందుకు తగ్గించలేదో స్పష్టత ఇవ్వలేదు. గత రెండేళ్లల్లో 8.50 లక్షల కిట్లు మిగిలినా వచ్చే విద్యా సంవత్సరానికి అదనంగా 5 శాతం ఎందుకు కొంటున్నారు? ఎస్‌ఎస్‌ఏ చెబుతున్నదే వాస్తవమైతే మిగిలిన కిట్లను మినహాయించి కొనాలి కదా? విద్యా కానుకలో మిగిలిన కిట్లపై ఎస్‌ఎస్‌ఏ ఇచ్చిన వివరణపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఈనాడు’లో ఆదివారం ప్రచురితమైన ‘కిట్లు కొన్నారు.. కోట్లు తిన్నారు!’ కథనంపై ఫ్యాక్ట్ చెక్ పేరుతో సమగ్ర శిక్ష అభియాన్ వివరణ ఇచ్చింది. ఏటా విద్యార్థుల సంఖ్యకు అదనంగా 5 శాతం కలిపి వస్తువులను కొంటామని, విద్యా సంవత్సరం మధ్యలో వచ్చిన విద్యార్థులకు పంపిణీ చేయడానికి ఇలా చేస్తున్నామని తెలిపింది. కొనాల్సిన వస్తువుల సంఖ్య, వాటి పంపిణీ, నిల్వల నిర్వహణ వంటివన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని వెల్లడించింది. పంపిణీ తర్వాత ఇక తీసుకోవాల్సిన పిల్లలు లేరని నిర్ధారించుకున్నాక వాటన్నింటినీ ఆడిట్ చేసి, ఇంకా ఎన్ని మిగిలాయో చూసి, ఆ తర్వాతి ఏడాదికి కొనుగోళ్లు చేస్తామని తెలిపింది.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
* ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 40.31 లక్షలుండగా.. దీనిపై 5 శాతం అధికంగా లెక్కేసి 43.10 లక్షల కిట్లు కొంటోంది. ఈ లెక్కన వచ్చే విద్యా సంవత్సరానికి ఈ వస్తువులే సరిపోతాయి. మరి గత రెండేళ్లల్లో మిగిలిన 8.50 లక్షల కిట్లను ఏం చేస్తారు?
* 2022-23లో 47,40,421 మంది విద్యార్థులకు రూ.931.02 కోట్లతో విద్యా కానుక అందిస్తున్నట్లు 2022 జులై 5న ప్రభుత్వం పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. కానీ, ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చిన దాంట్లో లబ్ధిదారుల సంఖ్య 2022-23లో 45,14,687గా పేర్కొంది. దీనికి రూ.886.69 కోట్లు వ్యయం చేసినట్లు వెల్లడించింది. పత్రికా ప్రకటనల్లో ఇచ్చిన దానికి, ఫ్యాక్ట్ చెక్‌లో చెప్పిన దానికీ 2.25 లక్షల కిట్ల వ్యత్యాసం ఉంది. ఒక్కోసారి ఒక్కో అంకెతో అందర్నీ అయోమయానికి గురి చేస్తోంది.
* మూడేళ్లల్లో కలిపి రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసినట్లు పత్రికా ప్రకటనల్లో ప్రభుత్వం పేర్కొంది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇచ్చిన దాంట్లో మూడేళ్లల్లో రూ. 2,324 కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించింది. నిధుల ఖర్చులోనూ రూ.44.33 కోట్ల వ్యత్యాసం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
యూపీలో రోడ్డుపై మహిళను ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుళ్లు
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!