వైభవంగా పౌర్ణమి గరుడసేవ

శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు మెరిసిపోతున్న గరుడ వాహనంపై కొలువుదీరి తిరు మాడ వీధుల్లో విహరించారు.

Updated : 06 Feb 2023 05:39 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు మెరిసిపోతున్న గరుడ వాహనంపై కొలువుదీరి తిరు మాడ వీధుల్లో విహరించారు.


నూతన పరకామణిలో లెక్కింపు ప్రారంభం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో కొత్తగా నిర్మించిన పరకామణి భవనంలో హుండీ కానుకల లెక్కింపును ఆదివారం ప్రారంభించారు. ఉదయం పెద్దజీయర్‌స్వామి ఆశీస్సులతో శ్రీవారి ఆలయం నుంచి 12 హుండీలను వెలుపలకు తెచ్చి లారీలోకి ఎక్కించారు. లారీని తితిదే ఈవో ధర్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించగా, కొత్త భవనానికి తరలించారు. అక్కడ శ్రీవారి సేవకులు కానుకల లెక్కింపు చేపట్టగా ఈవో పరిశీలించారు. భక్తుల చూసేలా ఈ భవనానికి గ్లాసులు బిగించి, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ నెలరోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించాక ఆలయంలోని పాత పరకామణిని పూర్తిగా తొలగించి, అక్కడ భక్తులు ధ్యానం చేసుకునేందుకు అనుమతిస్తామని ఈవో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని