‘మార్గదర్శి’ మేనేజర్‌ కస్టడీ తిరస్కరణ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మార్గదర్శి కార్యాలయ మేనేజర్‌ రవిశంకర్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు వేసిన పిటిషన్‌ను మంగళవారం జిల్లా కోర్టు తిరస్కరించింది.

Published : 22 Mar 2023 05:08 IST

ఈనాడు, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మార్గదర్శి కార్యాలయ మేనేజర్‌ రవిశంకర్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు వేసిన పిటిషన్‌ను మంగళవారం జిల్లా కోర్టు తిరస్కరించింది. సీఐడీ అధికారులు సోమవారం దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి కె.సునీత పిటిషన్‌ తిరస్కరిస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు. రవిశంకర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.

విశాఖ సీతంపేట శాఖ మేనేజర్‌కు బెయిల్‌

రిమాండ్‌లో ఉన్న మార్గదర్శి సీతంపేట శాఖ మేనేజర్‌ కె.రామకృష్ణకు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.తిరుమలరావు మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. ‘రామకృష్ణ రూ.25వేల విలువకు వ్యక్తిగత పూచీకత్తు, అదే విలువకు రెండు ష్యూరిటీలను సమర్పించాలి. న్యాయస్థానం పరిధిని దాటి వెళ్లకూడదు. చందాదారులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంప్రదింపులు చేయకూడదు. సాక్షులను ప్రభావితం చేయరాదు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ప్రతి సోమవారం సీఐడీ కార్యాలయానికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల లోపు ఏదో ఒక సమయంలో హాజరు కావాలి. సీఐడీ అధికారులకు అందుబాటులో ఉండి విచారణకు సహకరించాలి. విచారణలో ఎటువంటి సహకారం అందించని పక్షంలో సీఐడీ అధికారులు రాతపూర్వకంగా బెయిల్‌ రద్దును కోరవచ్చు...’ అని న్యాయమూర్తి షరతులు విధించారని రామకృష్ణ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఎం.రవి, టి.సత్యశ్రీకాంత్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని