అరసవల్లి చేరుకున్న అమరావతి రథం

అమరావతి రథం శనివారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చేరుకుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘మహా పాదయాత్ర 2.0’ గతేడాది నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

Published : 02 Apr 2023 04:56 IST

నేడు ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకోనున్న రైతులు

అరసవల్లి, న్యూస్‌టుడే: అమరావతి రథం శనివారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చేరుకుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ‘మహా పాదయాత్ర 2.0’ గతేడాది నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ యాత్రలో రైతుల వెంట వచ్చిన రథాన్ని కూడా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిలిపివేశారు. ఆగిన రథాన్ని అరసవల్లి తీసుకువెళ్లి యాత్రకు ముగింపు పలకాలని రైతులు నిర్ణయించారు. ఆ మేరకు శుక్రవారం రామచంద్రపురంలో బయలుదేరిన రథం అరసవల్లి చేరుకుంది. అమరావతి నుంచి రైతులు కూడా వచ్చి నేడు అరసవల్లి సూర్యనారాయణస్వామి సన్నిధిలో మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం జిల్లాకు చేరుకున్నవారికి తెదేపా నాయకుడు గొండు శంకర్‌ ఆధ్వర్యంలో ఓ కల్యాణ మండపంలో బస ఏర్పాటు చేశారు. ఆదివారం రథాన్ని ఆదిత్యాలయ సమీపంలో భక్తుల సందర్శనార్థం ఉంచనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని