అడ్డొస్తే నరికేస్తా.. ట్రాక్టర్‌తో తొక్కించేస్తా: డ్రైవర్‌ వీరంగం

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని ఆముదార్లంక గ్రామంలో ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ రెచ్చిపోయాడు.

Updated : 27 Jul 2023 09:01 IST

చల్లపల్లి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలోని ఆముదార్లంక గ్రామంలో ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ రెచ్చిపోయాడు. కొంతకాలంగా ఇసుక రవాణాకు రోజూ ట్రాక్టర్లు, టిప్పర్లు వందల ట్రిప్పులు వేస్తుండటంతో ఈ గ్రామంలో రహదారులు ఛిద్రమైపోతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రంగారావు అనే వృద్ధుడు, మరో మహిళ ధైర్యం చేసి ఓ ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆ ట్రాక్టర్‌ డ్రైవర్‌ పూనకాలు వచ్చేసినట్లుగా అడ్డొస్తే నరికేస్తా.. ట్రాక్టర్‌తో తొక్కించేస్తా.. తప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతలోనే ట్రాక్టర్‌ను ఒక్క ఉదుటున దూకించడంతో రంగారావు ట్రాక్టర్‌ కింద పడిపోయారు. దీంతో చుట్టుపక్కల వారందరూ వచ్చి డ్రైవర్‌ను కిందకి దింపి.. మరోసారి ఇసుక రవాణాకు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై వేములపల్లి రాణి అనే మహిళ ఫిర్యాదు చేయగా చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని