డెట్ ఫండ్ల పోర్ట్‌ఫోలియోను చెక్‌ చెసుకోండిలా ..

పోర్ట్ ఫోలియో లో పెట్టుబడులు కొద్ది కంపెనీలలో గానీ, కొన్ని రంగాలకు గానీ పరిమితం చేయకూడదు....

Published : 23 Dec 2020 15:48 IST

పోర్ట్ ఫోలియో లో పెట్టుబడులు కొద్ది కంపెనీలలో గానీ, కొన్ని రంగాలకు గానీ పరిమితం చేయకూడదు

ఈ మధ్యనే ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ మ్యూచువల్ ఫండ్ తమ ఆరు డెట్ ఫండ్ లను తాత్కాలికంగా మూసివేసింది . అంటే ఈ పథకాలలో అమ్మకాలుగానే, కొనుగోళ్లు గానే జరగవు. ఒకవేళ మీరు ఈ 6 ఫండ్స్ లో దేనిలోనైనా పెట్టుబడి చేసుంటే, కొంత కాలం ఆగడం తప్ప చేసేదేమీ లేదు . మీరు వేరేదైనా డెట్ ఫండ్స్ లో పెట్టుబడి చేసుంటే, ఈ విధంగా చూసుకోండి .

పోర్ట్ ఫోలియో లో ‘AAA’ లేదా తత్సమానత రేటెడ్ కంపెనీలలో , అలాగే మంచి పేరుగల ‘AA’ వంటి తక్కువ రేటెడ్ కంపెనీలలో పెట్టుబడి చేసినా ఫరవాలేదు . మీరు క్రెడిట్ ఫండ్ లో పెట్టుబడి చేయలేదు కాబట్టి, మీ పీచబడి రిస్క్ లేదనుకోవద్దు. ఒక ఫండ్ వేరే ఏ ఇతర పోర్ట్ ఫోలియోలలో క్రెడిట్ రిస్క్ కలిగిన పెట్టుబడి చేసుండొచ్చు. అయితే ఇటువంటి తక్కువ రేటెడ్ లేదా క్రెడిట్ రిస్క్ లలో పెట్టుబడి పోర్ట్ ఫోలియో లో 5 శాతానికి మించరాదు.

పోర్ట్ ఫోలియో లో పెట్టుబడులు కొద్ది కంపెనీలలో గానీ, కొన్ని రంగాలకు గానీ పరిమితం చేయకూడదు. ఉదా : బ్యాంక్స్, ఆర్ధిక సంస్థలు, ఎన్బిఎఫ్సి లు, హోసింగ్ ఫైనాన్స్ కంపెనీ లు వంటి ఒకే రంగానికి చెందకూడదు. ఆయా రంగాలలో వృద్ధి లేకపోతే, పోర్ట్ ఫోలియో నష్టపోతుంది .

మొత్తం పోర్ట్ ఫోలియోలో, డెట్ లో చేసిన పెట్టుబడి సురక్షితం. అయినా దానిలో వచ్చే రాబడి కన్నా , రిస్క్ గురించి తెలుసుకోవాలి. తమ పెట్టుబడిలో డెట్ ఫై అధిక రాబడి ఎలా వస్తోంది, అలాగే మార్కెట్ లో ఉన్న ఇతర ఫండ్స్ కన్నా ఎలా బాగా పనిచేస్తోందో, మదుపరులు అడిగి తెలుసుకోవాలి. మీ పెట్టుబడికి నగదు లభ్యత (liquidity), అసెట్ క్వాలిటీ విషయంలో ఫండ్ హౌస్ ఎటువంటి విధానాన్ని అవలంబిస్తోందో , మీ అడ్వైసర్ ద్వారా ఫండ్ గురించి మరింత వివరంగా తెలుసుకోవాలి. మీకు సరైనదని అనిపించకపోతే , వైదొలగటం మంచిది.

మదుపరులు తమ మొత్తం డెట్ లో చేసే పెట్టుబడిలో , ఏ ఒక్క డెట్ ఫండ్ లో 10 శాతానికి మించకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థ, అలాగే మ్యూచువల్ ఫండ్స్ రంగం కూడా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి, కాబట్టి మదుపరులు గట్టి కారణం ఉంటే తప్ప , తమ పెట్టుబడులలో మార్పుచేయకూడదు. పోర్ట్ ఫోలియో ను ఒకసారి సరిచూసుకోండి . అవసరమైతే నిపుణుల సలహా పొందండి . మార్పులు చేసేముందు వాటికి అయ్యే ఖర్చులు, పన్నుల్లో మార్పు వంటి విషయాలను గుర్తించండి. చాలామంది మదుపరులకు డెట్ ఫండ్స్ పన్ను

ప్రయోజనాలతో పాటు , నగదు లభ్యత, లక్ష్యాలకు తగిన విధంగా వివిధ కాలపరిమితులకు పెట్టుబడి చేసుకునే అవకాశం కలిపిస్తాయి .

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని