Apple Event: యాపిల్‌ నుంచి ఐప్యాడ్‌ ఎయిర్‌, ఐప్యాడ్‌ ప్రో, పెన్సిల్‌.. ధర, విశేషాలు ఇవీ..

Apple Let Loose Event 2024: ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ లెట్‌ లూజ్‌ ఈవెంట్‌లో కొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌, ఐప్యాడ్‌ ప్రో, యాపిల్‌ పెన్సిల్ ప్రోలను ఆవిష్కరించింది.

Published : 08 May 2024 16:37 IST

Apple Let Loose Event 2024 | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌ (Apple) ‘లెట్‌ లూజ్‌’ ఈవెంట్‌ను మార్చి 7న నిర్వహించింది. యాపిల్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూసే ఈవెంట్‌లో సరికొత్త డివైజ్‌లను ఆవిష్కరించింది. కొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌ (iPad Air), ఐప్యాడ్‌ ప్రో (iPad Pro), యాపిల్‌ పెన్సిల్ ప్రో (Apple Pencil Pro)ను లాంచ్‌ చేసింది. వీటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

ఐప్యాడ్‌ ఎయిర్‌

ఐప్యాడ్‌ ఎయిర్‌లో శక్తిమంత ఎం2 (M2) చిప్‌ను అమర్చారు. ఈ ప్యాడ్‌ రెండు సైజుల్లో లభిస్తుంది. 11 అంగుళాలు, 13 అంగుళాల లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లేతో యాపిల్‌ తీసుకొచ్చింది. బ్లూ, పర్పుల్‌, స్టార్‌లైట్‌, స్పేస్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది. 128జీబీ, 256 జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ముందుభాగంలో 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, వెనక వైపు 12 ఎంపీ వైడ్‌ కెమెరా ఇచ్చారు. 11 అంగుళాల ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌) ధర రూ.59,900, వైఫై+సెల్యులార్‌ మోడల్‌ ధర రూ.74,900గా నిర్ణయించారు. 13 అంగుళాల ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌) ధర రూ.79,900, వైఫై+సెల్యులార్‌ మోడల్‌ ధర రూ.94,900గా ఉన్నాయి. యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో వినియోగదారులు కొత్త ఐప్యాడ్‌ ఎయిర్‌ను ఆర్డరు చేసుకోవచ్చు. ఈనెల 15 నుంచి వినియోగదారులు ఇవి అందుబాటులోకి వస్తాయి.

ఐప్యాడ్‌ ప్రో

ఐప్యాడ్‌ ప్రోలో ఎం4 (M4) చిప్‌ అమర్చారు. 11 అంగుళాలు, 13 అంగుళాల డిస్‌ప్లే సైజుల్లో అత్యాధునిక టెన్డం ఓఎల్‌ఈడీ అల్ట్రా రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేని కలిగిఉంటుంది. సిల్వర్‌, స్పేస్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ, 2టీబీ కాన్ఫగరేషన్లతో లభిస్తుంది. ముందుభాగంలో 12ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా, వెనకవైపు 12ఎంపీ వైడ్‌ కెమెరా కలిగిఉంటుంది. 11 అంగుళాల ఐప్యాడ్‌ ప్రో (వైఫై మోడల్‌) ధర రూ.99,900గా, వైఫై+సెల్యులార్‌ మోడల్‌ ధర రూ.1,19,900గా నిర్ణయించారు. 13 అంగుళాల ఐప్యాడ్‌ ఎయిర్‌ (వైఫై మోడల్‌) ధర రూ.1,29,900, వైఫై+సెల్యులార్‌ మోడల్‌ ధర రూ.1,49,900గా ప్రకటించింది. థండర్‌బోల్డ్‌ 3, యూఎస్‌బీ 4, వైఫై 6ఈ, 5జీ, యూఎస్‌బీ-సీకి ఈ ప్యాడ్‌  సపోర్ట్‌ చేస్తుంది. 

పెన్సిల్‌ ప్రో

ఐప్యాడ్‌లపై రాసుకునేందుకు వీలుగా కొత్త పెన్సిల్‌ ప్రోను కూడా ఇదే ఈవెంట్‌లో యాపిల్‌ లాంచ్‌ చేసింది. ఈ పెన్సిల్‌.. ఐప్యాడ్ ప్రో (13 అంగుళాలు), ఐప్యాడ్‌ ప్రో 11, ఐప్యాడ్‌ ఎయిర్‌ 13, ఐప్యాడ్‌ ఎయిర్‌ 11కు సపోర్ట్ చేస్తుంది. స్క్వీజ్, బారెల్ రోల్, హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ వంటి అధునాతన ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. గతంలో తీసుకొచ్చిన పెన్సిల్‌ కంటే ఇది మరింత మెరుగైందని కంపెనీ పేర్కొంది. దీని ధరను రూ.11,900గా యాపిల్‌ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని