Mercedes-Benz: మెర్సిడెస్-బెంజ్‌ విక్రయాల్లో 100 శాతం వృద్ధి!

జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌‌-బెంజ్‌ కార్ల విక్రయాలు సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారీగా పుంజుకున్నాయి....

Published : 06 Oct 2021 22:50 IST

ముంబయి: జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌‌-బెంజ్‌ కార్ల విక్రయాలు భారత్‌లో భారీగా పుంజుకున్నాయి. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికం విక్రయాల్లో 100 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 2,058 యూనిట్లు అమ్ముడవగా.. ఈసారి అవి 100 శాతం పెరిగి 4,101గా నమోదయ్యాయి. రెండో త్రైమాసికంలో విధించిన కొవిడ్‌ ఆంక్షల నుంచి ఆర్థిక వ్యవస్థ బయటకు రావడం విక్రయాల వృద్ధికి దోహదం చేసిందని కంపెనీ పేర్కొంది.

జనవరి-సెప్టెంబరు మధ్య భారత్‌లో మొత్తం 8,958 మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 5,007 యూనిట్లను విక్రయించారు. కొత్త మోడల్‌ కార్లు అందుబాటులోకి రావడంతో పాటు విపణిలో ఉన్న సానుకూలతలు విక్రయాల వృద్ధికి కారణమైందని మెర్సిడెస్‌-బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్‌ అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పండగ సీజన్‌లోనూ బెంజ్‌ విక్రయాల జోరు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని