ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ టైర్ II ఖాతాపై పన్ను ప్రయోజనాలు

ఎన్‌పీఎస్‌ టైర్ II ఖాతా ఆదాయపు పన్ను ఆదా పథకం ఈక్విటీ, డెట్, క‌రెన్సీ / మనీ మార్కెట్ / లిక్విడ్ ఫండ్ల మిశ్రమం.......

Updated : 01 Jan 2021 17:09 IST

ఎన్‌పీఎస్‌ టైర్ II ఖాతా ఆదాయపు పన్ను ఆదా పథకం ఈక్విటీ, డెట్, క‌రెన్సీ / మనీ మార్కెట్ / లిక్విడ్ ఫండ్ల మిశ్రమం

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) టైర్ -2 ఖాతాకు సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు అర్హత ఉన్నట్లు ప్రభుత్వం గత నెలలో తెలియజేసిన తరువాత, పెన్షన్ నియంత్ర‌ణ సంస్థ‌ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ లేదా పీఎఫ్ఆర్‌డీఏ వివరణాత్మక మార్గదర్శకాలను విడుద‌ల చేసింది. ఇంతకుముందు, ఎన్‌పీఎస్‌ టైర్- II ఖాతాకు లాక్-ఇన్ పీరియ‌డ్ లేదు, కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పన్ను మినహాయింపు ల‌భించే ఈ పెట్టుబ‌డుల‌కు మూడేళ్లపాటు లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది.

ఎన్‌పిఎస్ టైర్ II ప‌థ‌కం గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు ఇక్కడ ఉన్నాయి:

  1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఎన్‌పిఎస్ టైర్ II పథకం కింద ఆదాయపు పన్ను ప్రయోజనాలకు అర్హులు. ఇందులో ప్రైవేట్ రంగ ఉద్యోగుల పెట్టుబ‌డుల‌పై లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉండ‌దు. అదేవిధంగా ప‌న్ను మిన‌హాయింపు ల‌భించ‌దు.
  2. సంవత్సరానికి సెక్షన్ 80 సి (రూ. 1.5 లక్షల వరకు) కింద ఆదాయపు పన్ను మినహాయింపు పొందటానికి ఎన్‌పీఎస్ టైర్ -2 ఖాతాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పెట్టుబ‌డుల‌పై 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటుంది.
  3. ఈ పన్ను ప్రయోజనాన్ని పొందాలనుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి మూడు ఎన్‌పీఎస్‌ ఖాతాలు ఉంటాయి: టైర్ -1 (ఇది తప్పనిసరి ఖాతా), టైర్ -2 (ఇది ఆప్ష‌న్‌, ఎప్పుడైనా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు), టైర్- II (సెక్షన్ 80సి ప్రయోజనంతో కూడిన ఆప్ష‌న‌ల్ ఖాతా, మూడు సంవ‌త్స‌రాల లాక్-ఇన్ ఉంటుంది).
  4. ఎన్‌పీఎస్‌ టైర్ II టాక్స్ సేవర్ ఖాతాలో పెట్టుబ‌డుల‌కు చందాదారులకు అవ‌కాశం ఉండదు.
  5. ఈ ఖాతాలో పెట్టుబ‌డులు ఈక్విటీ (10 శాతం నుంచి 25 శాతం), డెట్ (90 శాతం వరకు) , క‌రెన్సీ లిక్విడ్ ఫండ్లు (5 శాతం వ‌ర‌కు) ఉంటాయి.
  6. మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిలో ఉపసంహరణ అనుమతి ఉండ‌దు. అయితే చందాదారుడు మ‌ర‌ణిస్తే మొత్తాన్ని నామినీ / చట్టపరమైన వారసుడు ఉపసంహరించుకోవచ్చు.
  7. ఎన్‌పీఎస్ నుంచి నిష్క్రమించేందుకు టైర్ -1 ఖాతా మూసివేస్తే, ఎన్‌పిఎస్ టైర్ II ప‌న్ను ఆదా పథకానికి పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం ఉండ‌దు. లాక్-ఇన్ వ్యవధి పూర్తయిన తర్వాత ఎన్‌పిఎస్ టైర్ II టాక్స్ సేవర్ పథకం ముగుస్తుంది.
  8. ఎన్‌పీఎస్‌ టైర్ II ట్యాక్స్‌ సేవర్ పథకానికి చందాదారుడు ఏదైనా పెన్షన్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు.
  9. కానీ చందాదారునికి ఎన్‌పిఎస్ టైర్ II ట్యాక్స్ సేవర్ పథకం కోసం గరిష్టంగా మూడు పెన్షన్ ఫండ్‌లు విడివిడిగా ఉండటానికి అనుమతి ఉంటుంది.
  10. లాక్-ఇన్ వ్యవధి తర్వాత మాత్రమే పెన్షన్ ఫండ్ మార్పు అనుమతి ల‌భిస్తుంది. ఇటువంటి తిరిగి పెట్టుబడులు తాజా పెట్టుబడులుగా పరిగణించి, మళ్లీ మూడేళ్లపాటు లాక్-ఇన్ పీరియ‌డ్ విధిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని