నెట్ బ్యాంకింగ్ ద్వారా వివ‌రాలు లేకుండానే డ‌బ్బు పంపించ‌వ‌చ్చు

లాక్‌డౌన్‌ అయినప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి, ఎందుకంటే ప్రజలు కోవిడ్ -19 లేదా కరోనావైరస్ బారిన పడతారనే భయంతో కరెన్సీ నోట్లతో సహా ఏటీఎం వంటి వాటిని తాకడం మానుకుంటున్నారు. నెట్‌బ్యాంకింగ్‌కు వెళ్లే బదులు త‌క్ష‌ణ లావాదేవీలు చాలావ‌ర‌కు ఇప్పుడు గూగుల్ పే లేదా పేటీఎం..

Published : 18 Dec 2020 17:19 IST

లాక్‌డౌన్‌ అయినప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి, ఎందుకంటే ప్రజలు కోవిడ్ -19 లేదా కరోనావైరస్ బారిన పడతారనే భయంతో కరెన్సీ నోట్లతో సహా ఏటీఎం వంటి వాటిని తాకడం మానుకుంటున్నారు. నెట్‌బ్యాంకింగ్‌కు వెళ్లే బదులు త‌క్ష‌ణ లావాదేవీలు చాలావ‌ర‌కు ఇప్పుడు గూగుల్ పే లేదా పేటీఎం వంటి యాప్‌ల‌ను వాడుతున్నారు. కానీ ఇప్పుడు నెట్ బ్యాంకింగ్‌లో కూడా బెనిఫిషియ‌రీ వివ‌రాలను జోడించ‌కుండానే త‌క్ష‌ణ లావాదేవీలు చేసేవిధంగా స‌దుపాయాన్ని కొన్ని బ్యాంకులు అందుబాటులోకి తెచ్చాయి.

జులై 2018 లో ఎస్‌బీఐ ‘Quick Transfer’ స‌ర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగ‌దారులు ల‌బ్ధిదారుడుని యాడ్ చేసుకోకుండానే నెఫ్ట్‌, ఐఎంపీఎస్ ద్వారా త‌క్షణ‌ లావాదేవీలు చేయ‌వ‌చ్చు…

ఇందులో రోజుకు రూ.25 వేల వ‌ర‌కు బ‌దిలీ చేయ‌వ‌చ్చు. అయితే ఒక‌సారి రూ.10 వేలు మాత్ర‌మే పంపించేందుకు వీలుంది. దీనికోసం మీరు ఎవ‌రికైతే న‌గ‌దు పంపించాల‌నుకుంటున్నారో వారి పేరు, ఖాతా సంఖ్య‌ను ఎంట‌ర్ చేయాలి. మీ న‌మోదిత మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చే ఓటీపీ ఎంట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత లావాదేవీ పూర్తిచేయ‌వ‌చ్చు. ఎస్‌బీఐతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకుల‌కు కూడా ఈ స‌దుపాయం ఉంది.

ఎస్‌బిఐ నెట్ బ్యాకింగ్‌తో పాటు ఆన్‌లైన్ పోర్ట‌ల‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారునికి ఎస్‌బిఐలో ఖాతా ఉంటే, పంపిన మొత్తం వెంటనే ఖాతాకు జమ అవుతుంది. ఖాతా వేరే బ్యాంకులో ఉంటే, డబ్బును IMPS లేదా NEFT ద్వారా బదిలీ చేయవచ్చు.

ఐసీఐసీఐ బ్యాంకు విష‌యంలో కూడా ఇదేవిధంగా ఒక‌సారి రూ.10,000 పంపించే అవ‌కాశ‌ముంది. ఆన్‌లైన్ లావాదేవీలు చేసేట‌ప్పుడు ల‌బ్ధిదారుడి పేరు కంటే ఖాతా సంఖ్య ముఖ్యం కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా చూసి ఎంట‌ర్ ఏయాలి.

ఇక కోట‌క్ మ‌హీంద్రా బ్యాంకు విష‌యానికి వ‌స్తే “One Time Transfer" ఫీచ‌ర్ ద్వారా రోజుకు గ‌రిష్ఠంగా రూ.50,000 వ‌ర‌కు పంపించ‌వ‌చ్చు. అయితే కొత్త‌గా మీరు ఫోన్‌లో మొబైల్ బ్యాంకింగ్ రిజ‌స్ట‌ర్ చేసుకుంటే మొద‌టి వారం రోజులు రూ.10,000 వ‌ర‌కే ప‌రిమితి ఉంటుంది.

ముఖ్యంగా ఈ ‘Quick Transfer’ కేవ‌లం ఒకేసారి వెంట‌నే డ‌బ్బు బ‌దిలీ చేయ‌ల‌నుకుంటే, భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ మ‌ళ్లీ పంపించే అవ‌స‌రం లేనివారికి ఉప‌యోగప‌డుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని