డిజిట‌ల్ లావాదేవీల్లో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు..ప‌రిష్కారాలు

డీమానిటైజేష‌న్‌ ప్రకటించినప్పటినుంచి, డిజిటల్ చెల్లింపులలో పురోగతి క‌నిపిస్తోంది. చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా ప్రజలు వస్తువులు, సేవలకు డిజిటల్ విధానాన్నే పాటిస్తున్నారు. ఈ ప‌రిణామంతో భార‌త్ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ..

Updated : 01 Jan 2021 19:44 IST

డీమానిటైజేష‌న్‌ ప్రకటించినప్పటినుంచి, డిజిటల్ చెల్లింపులలో పురోగతి క‌నిపిస్తోంది. చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా ప్రజలు వస్తువులు, సేవలకు డిజిటల్ విధానాన్నే పాటిస్తున్నారు. ఈ ప‌రిణామంతో భార‌త్ నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మారుతోంది.

కేవలం ఒక క్లిక్‌తో చెల్లింపులు సుల‌భం కావ‌డంతో అంద‌రికి దీనిపై ఆస‌క్తి పెరిగింది. అయితే కొన్నిసార్లు తప్పు ఖాతాకు డబ్బు బదిలీ చేయడం లేదా విఫలమైన లావాదేవీలు వంటి కొన్ని సమస్యలు కూడా ఆన్‌లైన్ లావాదేవీల్లో ఎదుర‌వుతాయి. మ‌రి ఇటువంటి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలేంటో ఇప్పుడు చూద్ధాం.

  1. రెండు సార్లు న‌గ‌దు డెబిట్ కావ‌డం:
    చెల్లింపులకు డిజిటల్ విధానంలో ఉన్న సౌలభ్యం సాటిలేనిది. ఇది సులభంతో పాటు వేగంగా పూర్త‌వుతుంది. అందుకే రోజురోజుకు డిజిట‌ల్ చెల్లింపులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని స‌మ‌స్య‌లు ఎదురుకావొచ్చు. అందులో ఒకటి డబుల్ డెబిట్. అంటే ఒకే లావాదేవీకి రెండుసార్లు డ‌బ్బు డెబిట్ కావ‌డం. చాలా సార్లు, డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు, మీ లావాదేవీలు విఫ‌ల‌మ‌వుతుంటాయి. అప్పుడు మీరు మళ్ళీ లావాదేవీని చేస్తారు. కానీ ఆ మొత్తం ఖాతా నుంచి రెండుసార్లు డెబిట్ అవుతుంది.

ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉంద. , అంటే బ్యాంక్ రెండవ లావాదేవీని త్వరగా తిరిగి చెల్లించాలి. చాలావ‌ర‌కు బ్యాంకులు వెంట‌నే రీఫండ్ చేస్తాయి. కానీ కొన్నిసార్లు క‌స్ట‌మ‌ర్ కేర్‌ను సంప్ర‌దించి దీని గురించి అడ‌గాల్సి వ‌స్తుంది. బ్యాంకుల‌ మార్గదర్శకాలు, వేగవంతమైన చర్యల పరంగా ఇటువంటి స‌మ‌స్య‌ల ప‌రిష్కారాల్లో మెరుగుదలలు ఇప్పటికే కనిపిస్తున్నాయి, కాని మరింత వేగ‌వంత‌మైన చ‌ర్య‌లు వినియోగ‌దారుల‌ నమ్మకాన్ని పొందటానికి సహాయపడుతుంది.

  1. కార్డు చిప్ ప‌నిచేయ‌క‌పోవ‌డం:
    డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు మీరు లేదా మీ చుట్టూ ఉన్నవారు కనీసం ఒక్కసారైనా ఈ సమస్యను ఎదుర్కొని ఉంటారు. మీరు కార్డును ఎటిఎమ్ లేదా ఇఎంవి పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) టెర్మినల్‌లో ఉంచిన‌ప్పుడు అది ఒక్కోసారి ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు. అటువంటి పరిస్థితిలో, కార్డ్ డిప్ చేయ‌డానికి బదులుగా కార్డ్ స్వైప్ చేయ‌వ‌చ్చు. చిప్ బైపాస్ దీనికి మరొక మార్గం.

  2. క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీక‌రించ‌కపోవ‌డం:
    ఇందుకు కార‌ణం కొన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు కొన్ని స్వైప్ టెర్మినల్స్ వద్ద మాత్రమే అంగీకరిస్తాయి. దీంతో చెల్లింపుల స‌మ‌యంలో వినియోగ‌దారులు ఇబ్బంది ప‌డే అవకాశం ఉంది. కాబ‌ట్టి ఈ రోజుల్లో డిజిటల్ చెల్లింపులపై ప్రజలు ఎక్కువగా ఆధారపడటాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యాపారులు వారి టెర్మినల్స్‌లో అన్ని కార్డులు ప‌నిచేసే విధానంపై శ్ర‌ద్ధ పెట్టాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని తెలుస్తోంది.

  3. ఈఎంఐ లావాదేవీలు:
    ఈఎమ్ఐ చెల్లిస్తున్న‌ప్పుడు ఒక్కోసారి మీ ఖాతాలో డ‌బ్బు డెబిట్ అవుతుంది కానీ, అది ఈఎంఐ గా మార్చబడదు. ఇందులో భయపడటానికి ఏమీ లేదు. మీరు చేయవలసిందల్లా మీ బ్యాంకును సంప్ర‌దించి ఈఎంఐగా బ‌దిలీ చేయ‌మ‌ని కోరితే స‌రిపోతుంది.

  4. త‌ప్పు సంఖ్య ఎంట‌ర్ చేయ‌డం:
    ఒక్కోసారి మీరు చెల్లించాల్సిన మొత్తం త‌ప్పుగా ఎంట‌ర్ చేస్తుంటారు. అప్పుడు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. వెంట‌నే ఆ లావాదేవీని ర‌ద్దు చేసి కొత్త‌గా మ‌రోసారి చేస్తే స‌రిపోతుంది. డిజిట‌ల్ చెల్లింపులతో మీ డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంది.

  5. కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్:
    పరికరం, చెల్లింపుల టెర్మినల్ మధ్య భౌతిక సంబంధం అవసరం లేని లావాదేవీని కాంటాక్ట్‌లెస్ చెల్లింపు అంటారు, కాని కాంటాక్ట్‌లెస్ చెల్లింపు అందుబాటులో లేకుంటే చెల్లింపు కోసం మీరు కార్డును స్వైప్ చేయవచ్చు.

ముగింపు
ఫిన్‌టెక్ కంపెనీలు, అగ్రిగేటర్లు, బ్యాంకింగ్ అధికారులు అందరూ డిజిటల్ చెల్లింపులను మెరుగ్గా చేయడానికి… వినియోగదారుల సౌలభ్యం, నమ్మకం, విశ్వసనీయతను పెంచడానికి క్రమంగా కృషి చేస్తున్నారు. ఈ రంగం డిజిటల్ సంస్థ‌ల‌కు అపారమైన అవకాశాలను అందిస్తుంది. ప్ర‌పంచ‌ ఉత్తమ పద్ధతులకు సంబంధించి డిజిటల్ చెల్లింపుల వివిధ భాగాలను, విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందిన ప‌ద్ధ‌తుల‌ను సమగ్రంగా అధ్యయనం చేయడం ద్వారా ప్రభుత్వం గొప్ప చర్యలను ప్రారంభిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని