Petrol prices: నిలకడగానే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పదిహేను రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిలకడగానే ఉన్నాయి.

Updated : 02 Aug 2021 12:00 IST

దిల్లీ: దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పదిహేను రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు నిలకడగానే ఉన్నాయి. గత రెండు నెలలుగా భారీగా ధరలు పెరగగా.. కొంతకాలంగా ఎలాంటి మార్పు కనిపించకపోవడం కాస్త ఊరటనిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 దాటగా, మిగతా రాష్ట్రాల్లోనూ సెంచరీకి చేరువగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ. 101.84గా, డీజిల్‌ ధర లీటర్‌కు రూ.89.87గా ఉంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ ధరల ప్రకారం.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అధికంగా లీటర్‌ పెట్రోల్‌ రూ.107.83గా, డీజిల్ రూ.97.45 గాను ఉంది. ఇప్పటివరకు నాలుగు మెట్రో నగరాల్లోని రేట్లను పోల్చినట్లయితే ముంబయిలోనే ధరలు అత్యధికంగా ఉన్నాయని చమురు శుద్ధి సంస్థ తెలిపింది.

హైదరాబాద్‌లో ఇలా..

హైదరాబాద్‌లో ఆగస్టు 1న (సోమవారం) పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. లీటరు ధర రూ.105.83గా ఉంది. డీజిల్ ధర రూ.97.96 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

ధరలను ఎలా సవరిస్తారంటే..?

అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని చమురు శుద్ధి సంస్థలు ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తుంటాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌‌కు 1 శాతం తగ్గుదలతో 74.60 డాలర్లకు పడిపోయింది. అమెరికాలోని వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ (డబ్ల్యూటీఐ) క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.9 శాతం క్షీణతతో 73.26 డాలర్లకు తగ్గింది. దీనివల్ల ముడి చమురు ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. మారిన పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచే అమలు అవుతాయి.

ప్రధాన మెట్రో నగరాల్లోని ధరలివి..

నగరం పెట్రోల్‌ ధరలు
దిల్లీ 101.84  89.87
ముంబయి 107.83     97.45
చెన్నై 102.49  94.39
కోల్‌కతా 102.08 93.02
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని