Stock Market Closing Bell: ఆరంభ లాభాలు ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి....

Updated : 13 Dec 2021 15:38 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ముఖ్యంగా బజాజ్‌ ఫినాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌ వంటి దిగ్గజ షేర్లు సూచీలను కిందకు లాగాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాలను స్వీకరించడమే దీనికి ప్రధాన కారణం. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు, యూఎస్‌ ఫ్యూచర్స్‌ సానుకూలంగా కదలాడుతున్నాయి.

ఉదయం సెన్సెక్స్‌ 59,103.72 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 59,203.37 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 503.25 పాయింట్ల నష్టంతో 58,283.42 వద్ద ముగిసింది. 17,619.10 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,639.50-17,355.95 మధ్య కదలాడింది. చివరకు 143.05 పాయింట్లు నష్టపోయి 17,368.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.75 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ మినహా మిగిలినవన్నీ లాభపడ్డాయి. బజాజ్‌ ఫినాన్స్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు రాణించిన వాటిలో ఉన్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని