






తాజావార్తలు
కథనాలు
-
ఇళ్ల అమ్మకాల జోరు హైదరాబాద్‌లోనే -
ఆ వివరాలు చెప్పలేదు..పాలసీ తిరస్కరిస్తారా? -
స్పల్పకాలిక పెట్టుబడికి..
ఆర్థిక ప్రణాళిక
బ్యాంకింగ్
రుణాలు
ఇన్ఫోగ్రాఫిక్స్
బీమా
పెట్టుబడులు
ఆదాయపు పన్ను
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
A.మీరు ఎంచుకునే టర్మ్ పాలసీ లో బీమా మొత్తం మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఐసీఐసీఐ, మాక్స్ లైఫ్ లేదా ఎస్బీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించవచ్చు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
A.హెచ్డీఎఫ్సీ ప్రో గ్రోత్ ప్లస్ మదుపు, బీమా హామీ కలిపి ఇచ్చే ఒక యూలిప్ పాలసీ. ఇతర యూలిప్ పాలసీల వలే ఇందులో కూడా మోర్టాలిటీ, ఫండ్ మానేజ్మెంట్, రిస్క్ బెనిఫిట్ లాంటి ఎన్నో చార్జీలు విధిస్తారు. వీటి వల్ల మదుపు చేస్తే మొత్తం తగ్గిపోతుంది, కాబట్టి రాబడి కూడా తగ్గిపోతుంది. మీరు పాలసీని వెనక్కి ఇస్తే వచ్చే మొత్తం గురించి ఆరా తీసి కుదిరితే పాలసీ ని వెనక్కి ఇచ్చేయండి. ఇలా మిగిలిన డబ్బుని నెల నెలా సిప్ చేయండి. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 12 రెట్లు బీమా హామీ ఉండే టర్మ్ పాలసీ ని ఎంచుకోండి
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?
A.బ్యాంకు టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి బ్యాంకు జనరల్ మేనేజర్ స్థాయి ఉన్నత అధికారుల ఈ-మెయిల్ తెలుసుకోవాలి. బ్యాంకు గ్రీవెన్స్ సెల్, జనరల్ మేనేజర్‌కు, బ్యాంకు అంబుడ్స్మను ఈమెయిల్ ద్వారా సమస్యను తెలియజేయండి.