SBI: యూపీఐని ఎలా ఏర్పాటు చేయాలి?

యూపీఐ ద్వారా 24 గంట‌ల‌లో ఎప్పుడైనా ఒక బ్యాంక్ ఖాతా నుంచి మ‌రొక ఖాతాకు డ‌బ్బు పంపించ‌వ‌చ్చు

Published : 23 Jun 2021 12:04 IST

మీ ఖాతాకు యూపీఐను ఏర్పాటు చేయాలా?  ఆన్‌లైన్ ద్వారా సుల‌భంగా పూర్తిచేయ‌వ‌చ్చు. అంతే సుల‌భంగా నిలిపివేయ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం యూపీఐ.. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేసే చాలామందికి ప‌రిచ‌యం ఉన్న‌దే. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) వివిధ బ్యాంకు ఖాతాల‌ను ఒకే మొబైల్ ఫ్లాట్‌ఫామ్ కిందకి తీసుకొస్తుంది. యూపీఐ ద్వారా 24 గంట‌ల‌లో ఎప్పుడైనా ఒక బ్యాంక్ ఖాతా నుంచి మ‌రొక ఖాతాకు డ‌బ్బు పంపించ‌వ‌చ్చు. అయితే ఎస్‌బీఐ ఖాతాకు యూపీఐ ఎలా ఏర్పాటు చేయాలి? వ‌ద్ద‌నుకుంటే ఎలా నిలువ‌రించాలో తెలుసుకందాం. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులు.. నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా యూపీఐని సుల‌భంగా ప్రారంభించ‌వ‌చ్చు, అలాగే నిలిపివేయ‌చ్చు కూడా. ఆన్‌లైన్ ఎస్‌బీఐ, యోనో యాప్‌లు మీకు స‌హాయ‌ప‌డ‌తాయి. ఇంట్లోనే సుర‌క్షితంగా ఉంటూ, సౌక‌ర్య‌వంతంగా ఆన్‌లైన్ సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.  

నెట్ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేష‌న్ యోనో లైట్ ద్వారా యూపీఐ ప్రారంభించ‌డం/నిలిపివేసే విధానాన్ని ద‌శ‌ల వారిగా తెలుసుకుందాం. 

ఎస్‌బీఐ ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా..
* ముందుగా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వాలి.
మై ప్రోఫైల్ సెక్ష‌న్‌లో యూపీఐకి ఎనేబుల్‌/డిసేబుల్ అయ్యేందుకు ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.
ఖాతా నెంబ‌రును ఎంపిక చేసుకుని ఎనేబుల్‌/డిసేబుల్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేస్తే స‌రిపోతుంది. యూపీఐ సేవ‌లు ప్రారంభ‌మ‌వుతాయి.

యోనోలైట్ ద్వారా..
* మీ మొబైల్‌లోని ఎస్‌బీఐ యోనో లైట్ యాప్‌కి లాగిన్ అవ్వాలి. 
* యూపీఐ ట్యాబ్‌ను తెరిచి..ఎనేబుల్‌/డిసేబుల్ యూపీఐ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
* ఇక్క‌డ మీ ఖాతా నెంబ‌రును ఎంచుకుని ట‌ర్న్ ఆన్‌పై క్లిక్ చేస్తే యూపీఐ అందుబాటులోకి వ‌స్తుంది.
* వ‌ద్ద‌నుకుంటే ట‌ర్న్ ఆఫ్‌పై క్లిక్ చేస్తే స‌రిపోతుంది. అప్పటి నుంచి ఈ ఖాతాపై యూపీఐ లావాదేవీలు నిలిపివేయ‌బ‌డ‌తాయి. 
* ఒక‌వేళ మ‌ళ్లీ కావ‌ల‌నుకుంటే ట‌ర్మ్ ఆన్‌పై క్లిక్ చేసి తిరిగి ఎనేబుల్ చేసుకోవ‌చ్చు. 

బీహెచ్ఐఎమ్ ఎస్‌బీఐ పే అనేది యూపీఐ యాప్‌. బిల్లు చెల్లింపు నుంచి డ‌బ్బు బ‌దిలీ చేయ‌డం వ‌ర‌కు వివిధ ఫీచ‌ర్లు ఎస్‌బీఐ వినియోగ‌దారులకు అందుబాటులో ఉంటాయి. దీన్ని ఐదు సంవ‌త్స‌రాల క్రిత‌మే ప్రారంభించిన‌ప్ప‌టికీ క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా వినియోగ‌దారులు ఇళ్ల‌కే ప‌రిమితం కావ‌డంతో ఈ విధానం ద్వారా లావాదేవీలు చేసే వారికి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని