Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభం ₹673.93 కోట్లు

Adani Enterprises Q1 results: అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసిక ఫలితాల్లో రూ.673.93 కోట్ల వృద్ధిని నమోదు చేసుకుంది.

Updated : 03 Aug 2023 19:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) మొదటి త్రైమాసిక (Q1 results)ఫలితాలను గురువారం ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.673.93 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసుకొంది. గతేడాది ఇదే సమయంలో నమోదుచేసుకున్న రూ.469.46 కోట్లతో పోలిస్తే 43.55 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. ఆదాయంలో మాత్రం 38 శాతం క్షీణత నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.25,438 కోట్లుగా కాగా.. గతేడాది ఇదే సమయానికి ఆదాయం రూ.40,844  కోట్లుగా ఉందని కంపెనీ తన రెగ్యులేటరీ పైలింగ్‌లో తెలిపింది. ఎబిటా (EBITDA) 47 శాతం వృద్ధి చెంది రూ.2,896 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు విలువ 2.48 శాతం పెరిగి రూ.2,350 వద్ద ముగిసింది.

అదానీ పవర్‌ లాభంలో 83 శాతం వృద్ధి

అదానీ పవర్‌ (Adani Power) రూ.8,759.42 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,779.86 కోట్లతో పోలిస్తే లాభం 83.3 శాతం పెరిగినట్లు వెల్లడించింది. రూ.15,509 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం రూ.18,109.01 కోట్లకు పెరిగినట్లు సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మార్కెట్ ముగిసే సమయానికి అదానీ పవర్‌ షేరు విలువ 3.06 శాతం పెరిగి రూ.275.90 గా ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని