LIC IPO: ఐపీఓ కోసం ఆ బ్యాంకు శాఖలు తెరిచే ఉంటాయి: ఆర్‌బీఐ

ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO) నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఓ కోసం ASBA (అప్లికేషన్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్డ్‌ అమౌంట్‌)కు ఉద్దేశించిన బ్యాంకు శాఖలు ఆదివారం (మే 8న) సైతం తెరిచే ఉంటాయని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated : 01 Nov 2022 16:03 IST

ముంబయి: ఎల్‌ఐసీ ఐపీఓ (LIC IPO) నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఓ కోసం ASBA (అప్లికేషన్‌ సపోర్టెడ్‌ బై బ్లాక్డ్‌ అమౌంట్‌)కు ఉద్దేశించిన బ్యాంకు శాఖలు ఆదివారం (మే 8న) సైతం తెరిచే ఉంటాయని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎల్‌ఐసీ ఐపీఓ కోసం బిడ్డింగ్‌ ప్రక్రియను సులభతరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా దరఖాస్తు ప్రాసెస్‌ చేయడానికి అన్ని ఏఎస్‌బీఏ బ్యాంకు శాఖలు ఆదివారం సైతం తెరుచుకోనున్నాయని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పబ్లిక్‌ ఇష్యూల సమయంలో మదుపరులు షేర్ల కొనుగోలు కోసం ఏఎస్‌బీఏ మెకానిజం ఉపయోగపడుతుంది. 

రూ.21వేల కోట్లను సమీకరించే లక్ష్యంతో వచ్చిన ఎల్‌ఐసీ మెగా ఐపీఓ బిడ్డింగ్‌ ప్రక్రియ మే 9తో ముగియనుంది. ఐపీఓ కోసం శనివారం (మే 7న) కూడా బిడ్డింగ్‌ వేసే వెసులుబాటు ఉంది. బిడ్డింగ్‌కు ప్రారంభమైన తొలి రోజైన బుధవారం పాలసీహోల్డర్ల కోటా 1.9 రెట్లు ఓవర్‌ సబ్‌స్రైబ్‌ అయ్యింది. ఉద్యోగుల కోటా కూడా మొత్తం సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌, క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్ల (క్యూఐబీ) కోటాకు మాత్రం కాస్త స్పందన తక్కువగా ఉంది. మే 17న ఎల్‌ఐసీ షేర్లు మార్కెట్‌లో లిస్ట్‌ కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని