FDలపై బ్యాంకులు అందిస్తున్న తాజా వడ్డీ రేట్లు ఇవే..

నెల నెల స్థిర ఆదాయం కోసం వ‌డ్డీపై ఆధార‌ప‌డేవారు కూడా ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌నే న‌మ్ముకుంటున్నారు.

Updated : 12 Nov 2021 17:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ‌డ్డీ రేట్లు త‌గ్గిన‌ప్ప‌టికీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు జ‌నాద‌ర‌ణ పొందిన పెట్టుబ‌డి సాధ‌నాలుగానే కొన‌సాగుతున్నాయి. గ్యారెంటీ ఆదాయం కోసం చూస్తున్న సీనియ‌ర్ సిటిజ‌న్లు, గ్రామీణ ప్రాంతాల వారు, ముఖ్యంగా మ‌హిళ‌లు.. అదేవిధంగా రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌ని పెట్టుబ‌డిదారుల్లో అధిక శాతం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వైపే మొగ్గు చూపుతున్నారు. నెల నెలా స్థిర ఆదాయం కోసం వ‌డ్డీపై ఆధార‌ప‌డేవారు కూడా ఈ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌నే న‌మ్ముకుంటున్నారు. బ్యాంకుకు వెళ్ల‌కుండా, పేప‌ర్ వ‌ర్క్ లేకుండా ఆన్‌లైన్‌లో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి బ్యాంకులు. అయితే పెట్టుబ‌డుల‌లో ఎక్కువ భాగం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్ట‌డం అంత మంచిది కాద‌నేది నిపుణుల అభిప్రాయం. వ‌డ్డీ ప‌రంగా కూడా దీర్ఘ‌కాలం ఎఫ్‌డీలు అంత శ్రేయ‌స్క‌రం కాదు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద ఆర్జించే వ‌డ్డీ రాబ‌డి మొత్తాన్ని బ‌ట్టి ఆదాయ ప‌న్ను కూడా ఉంటుంది. ల‌క్ష్యం చేరుకునేందుకు దీర్ఘ‌కాలం స‌మ‌యం ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను ఎంచుకుంటే.. ల‌క్ష్యానికి చేరువ‌య్యే స‌మ‌యానికి కావల‌సిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకోలేక‌పోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు 10-15 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉన్న‌ మీ పిల్ల‌ల ఉన్న‌త విద్య కోసం మ‌దుపు చేసేందుకు ఎఫ్‌డీలు.. అంత ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేయ‌క‌పోవచ్చు. ఎందుకంటే ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించిన రాబ‌డి ప్ర‌స్తుత ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీల‌తో రావ‌డం లేదు. కానీ త‌క్కువ స‌మ‌యంలో డ‌బ్బు అవ‌స‌రం అనుకుంటే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మంచి ఆప్ష‌న్ అనే చెప్పాలి. మ‌న ల‌క్ష్యాల‌ను బ‌ట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలా? ఇంకా మ‌రేదైనా రాబ‌డి మార్గాన్ని చూసుకోవాలా? అనేది ఆలోచించాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ముందు వివిధ బ్యాంకులు ఇచ్చే వ‌డ్డీ రేట్లను స‌రిపోల్చుకోవాలి. అయితే పోస్టాఫీసు ఇచ్చే వ‌డ్డీల‌తో పోలిస్తే బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌కు ల‌భించే వ‌డ్డీ రాబ‌డి త‌క్కువ‌నే చెప్పాలి.

వివిధ కాల వ్య‌వ‌ధుల‌కు రూ. 1 కోటి వ‌ర‌కు డిపాజిట్ల‌కు అత్య‌ధిక వ‌డ్డీ రేట్లు అందించే ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకుల జాబితా..

నోట్‌: ఈ డేటా 8 న‌వంబ‌ర్ 2021 నాటిది. విలీన‌మైన బ్యాంకుల ప్ర‌ధాన సంస్థ పేరు మాత్ర‌మే తీసుకున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని