Higher Pension: అధిక పింఛను దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

EPFO Higher pension: ఈపీఎఫ్‌వో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అధిక పింఛను దరఖాస్తుకు ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించింది.

Updated : 26 Jun 2023 22:29 IST

దిల్లీ: ఈపీఎఫ్‌వో(EPFO) పరిధిలోకి వచ్చే వేతనజీవుల అధిక పింఛనుకు(Higher pension) ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. గతంలో ఇచ్చిన గడువు జూన్‌ 26(సోమవారం)తో ముగియనుండగా.. దాన్ని మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. దీంతో వేతనజీవులు జులై 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కలిగింది. గతంలో మే 3వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియగా.. జూన్ 26 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అర్హులైన పింఛనుదారులు/సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకే చివరి అవకాశంగా మరో 15 రోజలు పాటు అవకాశం ఇస్తున్నట్టు ఈపీఎఫ్‌వో వెల్లడించింది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు యజమాని(ఎంప్లాయర్‌)కు 3 నెలలు; ఉద్యోగి (సభ్యుడు)కి 15 రోజుల పాటు గడువును పొడిగించినట్టు ఈపీఎఫ్‌వో ప్రతినిధి రఘునాథ్‌ కేఈ తెలిపారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు సాంకేతిక అడ్డంకులు, కచ్చితంగా జత చేయాల్సిన ఈపీఎఫ్‌వో పాస్‌బుక్‌కు సర్వర్‌ మొరాయించడం తదితర కారణాలతో అర్హులైన పింఛనుదారులు, కార్మికులు దరఖాస్తు చేసుకోలేకపోవడంతో అధిక పింఛను దరఖాస్తు గడువు పొడిగించాలంటూ పింఛనుదారులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, సీబీటీ సభ్యులు ఈపీఎఫ్‌వో కమిషనర్‌కు గతంలో విజ్ఞప్తి చేయడంతో మే 3 నుంచి జూన్‌ 26వరకు అవకాశం ఇచ్చారు. తాజాగా మరోసారి గడువు పొడిగించడం ద్వారా ఇప్పటివరకు దరఖాస్తు చేయలేకపోయిన వారికి మరో ఛాన్స్‌ ఇచ్చినట్టయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని