అధునాతనంగా యూబీఐ డిజిటల్‌ సేవలు

ఖాతాదారులకు మరింతగా చేరువయ్యేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) మెగా అవుట్‌రీచ్‌ కార్యక్రమాన్ని గురువారం చేపట్టింది.

Updated : 09 Jun 2023 05:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఖాతాదారులకు మరింతగా చేరువయ్యేందుకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) మెగా అవుట్‌రీచ్‌ కార్యక్రమాన్ని గురువారం చేపట్టింది. కోఠి రీజియన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.కె.మహాపాత్ర ప్రసంగించారు.  డిజిటల్‌ సేవలను మెరుగుపరుస్తున్నామని, ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత పథకాల్లో మార్పులు చేస్తున్నామని మహాపాత్ర తెలిపారు. తద్వారా కొత్త ఖాతాదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. విద్యా రుణాలు అందించడంలో యూబీఐ ముందంజలో ఉందని హైదరాబాద్‌ జోనల్‌ మేనేజర్‌ కె.భాస్కరరావు చెప్పారు. ప్రతిభ గల విద్యార్థులకు అతి తక్కువ వడ్డీ రేట్లకు సులభతర షరతులతో రూ.40 లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈ రుణాలు అతి తక్కువ వ్యవధిలో మంజూరు చేస్తున్నట్టు కోఠి రీజనల్‌ హెడ్‌ కల్యాణ్‌ చెప్పారు. అనంతరం సుమారు రూ.103 కోట్ల విలువైన ఎంఎస్‌ఎంఈ, గృహ-విద్యారుణాలు, తనఖా రుణాల పత్రాలను ఖాతాదారులకు అందించారు. కార్యక్రమంలో ఏజీఎంలు విశ్వేశ్వర్‌, రఘునాథ్‌, పలు శాఖల మేనేజర్లు, 120 మంది ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు