హార్లిక్స్‌ ‘హెల్త్‌ డ్రింక్‌’ కాదు

హిందుస్థాన్‌ యునిలీవర్‌(హెచ్‌యూఎల్‌) తన బ్రాండ్‌ హార్లిక్స్‌ లేబుల్‌పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్‌ ఫుడ్‌ డ్రింక్స్‌’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్‌ను ‘ఫంక్షనల్‌ న్యూట్రిషనల్‌ డ్రింక్స్‌’ కేటగిరిలోకి మార్చింది.

Published : 27 Apr 2024 01:57 IST

లేబుల్‌ మార్చిన హెచ్‌యూఎల్‌

ఈటీవీ భారత్‌: హిందుస్థాన్‌ యునిలీవర్‌(హెచ్‌యూఎల్‌) తన బ్రాండ్‌ హార్లిక్స్‌ లేబుల్‌పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్‌ ఫుడ్‌ డ్రింక్స్‌’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్‌ను ‘ఫంక్షనల్‌ న్యూట్రిషనల్‌ డ్రింక్స్‌’ కేటగిరిలోకి మార్చింది. హెల్త్‌ డ్రింక్స్‌ కేటగిరి నుంచి డ్రింక్స్‌, పానీయాలను తొలగించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అన్ని ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ) రితేష్‌ తివారీ మాట్లాడుతూ, హార్లిక్స్‌ ఫంక్షనల్‌ న్యూట్రిషనల్‌ డ్రింక్స్‌(ఎఫ్‌ఎన్‌డీ) లేబుల్‌కు మారడం ఉత్పత్తిని మరింత కచ్చితంగా, పారదర్శకంగా వర్గీకరించేందుకు సులభతరం అవుతుందని పేర్కొన్నారు.

తప్పుదారి పట్టేంచేలా ఉండడం వల్లే: ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఇటీవల ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో డెయిరీ ఉత్పత్తులను లేబులింగ్‌ చేయకూడదని తెలిపింది. తృణధాన్యాలతో కూడిన పాల ఉత్పత్తులు, ఆరెంజ్‌, లైమ్‌ వంటి ఫ్లేవర్లతో కూడిన ఆరోగ్య పానీయాల కేటగిరీలు వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని తెలిపింది. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసిందని ‘ఈటీవీ భారత్‌’తో మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీస్‌ డాక్టర్‌ జగదీష్‌ ప్రసాద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని