విద్యుత్‌ వాహనాలపై దిగుమతి సుంకం తగ్గించాలి: బీఎండబ్ల్యూ

విద్యుత్‌ వాహనాలపై (ఈవీలు) కొంతకాలం పాటు లేదా పరిమిత యూనిట్లపై దిగుమతి సుంకం తగ్గిస్తే దేశీయంగా గిరాకీ పెరుగుతుందని బీఎండబ్ల్యూ ప్రభుత్వానికి సూచించింది. అప్పుడు స్థానికంగా

Published : 29 Nov 2021 01:52 IST

దిల్లీ: విద్యుత్‌ వాహనాలపై (ఈవీలు) కొంతకాలం పాటు లేదా పరిమిత యూనిట్లపై దిగుమతి సుంకం తగ్గిస్తే దేశీయంగా గిరాకీ పెరుగుతుందని బీఎండబ్ల్యూ ప్రభుత్వానికి సూచించింది. అప్పుడు స్థానికంగా తయారీకి కూడా ఊతమిచ్చినట్లు అవుతుందని పేర్కొంది. అలాగే కొత్త సాంకేతికత భారత్‌కు బదిలీ అవుతుందని తెలిపింది. దేశంలో విద్యుత్‌ వాహన ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో భాగంగా వచ్చే 6 నెలల్లో 3 విద్యుత్‌ వాహనాలను భారత్‌లో విడుదల చేయనున్నామని ఇటీవల కంపెనీ ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ సెడాన్‌ బీఎండబ్ల్యూ ఐ4 తర్వాత వీటిని విడుదల చేస్తామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని