రూ.7,460 కోట్ల డెలివరీ ఐపీఓ

సరఫరా చైన్‌ కంపెనీ డెలివరీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.7,460 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఐపీఓలో రూ.5,000 కోట్ల విలువైన తాజా షేర్లను

Published : 19 Jan 2022 03:40 IST

దిల్లీ: సరఫరా చైన్‌ కంపెనీ డెలివరీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.7,460 కోట్ల నిధుల్ని సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఐపీఓలో రూ.5,000 కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా రూ.2,460 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నట్లు ముసాయిదా పత్రాల్లో కంపెనీ పేర్కొంది. ఓఎఫ్‌ఎస్‌లో కార్లైల్‌ గ్రూప్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌, డెలివరీ సహ వ్యవస్థాపకులు కపిల్‌ భారతి, మోహిత్‌ టాండన్‌, సూరజ్‌ సహరన్‌ తమ వాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం కంపెనీలో సాఫ్ట్‌ బ్యాంక్‌కు 22.78 శాతం, కార్లైల్‌కు 7.42 శాతం, చైనా మూమెంటమ్‌ ఫండ్‌కు 1.11 శాతం, కపిల్‌ భారతికి 1.11 శాతం, టాండన్‌కు 1.88 శాతం, సూరజ్‌కు 1.79 శాతం వాటాలున్నాయి. ఈ ఇష్యూకు కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా, మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా కంపెనీ, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని