సంక్షిప్త వార్తలు

ప్లాస్టిక్‌ స్ట్రా సహా ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్స్‌లపై నేటి నుంచి నిషేధం అమల్లోకి రావడంతో ఎఫ్‌ఎమ్‌సీజీ, వ్యవసాయ ఆహార కంపెనీలు పళ్లరసాలు, డెయిరీ ఉత్పత్తుల కోసం పేపరు స్ట్రాలను వినియోగించనున్నాయి.

Updated : 01 Jul 2022 07:03 IST

* ప్లాస్టిక్‌ స్ట్రా సహా ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్స్‌లపై నేటి నుంచి నిషేధం అమల్లోకి రావడంతో ఎఫ్‌ఎమ్‌సీజీ, వ్యవసాయ ఆహార కంపెనీలు పళ్లరసాలు, డెయిరీ ఉత్పత్తుల కోసం పేపరు స్ట్రాలను వినియోగించనున్నాయి.

* ఇండియన్‌ బ్యాంక్‌ తన ఎమ్‌సీఎల్‌ఆర్‌ను అన్ని కాలావధులపై 0.15 శాతం మేర పెంచింది.

* రూ.12,000 కోట్ల సమీకరణ కోసం ఈ నెలలో పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వాటాదార్ల అనుమతిని కోరనుంది.

* ప్రభుత్వం నేరుగా స్పెక్ట్రమ్‌ను క్యాప్టివ్‌ ప్రభుత్వేతర నెట్‌వర్క్‌ సంస్థలకే కేటాయించడం ద్వారా 5జీ వ్యాపారంలోకి దొడ్డిదారిన రావడానికి వీలు కల్పించినట్లయిందని సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాయ్‌) పేర్కొంది.

* భారతీ ఎయిర్‌టెల్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేయాలన్ని గూగుల్‌ ప్రతిపాదనకు కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆమోదముద్ర వేసింది.

* భారత్‌లో ఎఫ్‌డీఐ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు నిధుల మళ్లింపునకు మెట్రో ఏజీకి చెందిన మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ పాల్పడిందని ట్రేడర్ల సంఘం కెయిట్‌ ఆరోపించింది. అయితే జర్మనీ కంపెనీ మాత్రం వీటిని ఖండించింది.

* స్కిజోఫ్రీనియా చికిత్సకు ఉపయోగించి పాలిపెరిడోన్‌ మాత్రలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి లుపిన్‌కు అనుమతులు వచ్చాయి. మరో వైపు, పార్షియల్‌-ఆన్‌సెట్‌ సీజర్స్‌ చికిత్సలో వినియోగించి లాకోసమైడ్‌ జనరిక్‌ ఇంజెక్షన్‌కు జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తుది అనుమతులు లభించాయి.

* మహిళలతోనే పూర్తిగా నడిచే తొలి డ్రైవ్‌ త్రూ రెస్టారెంట్‌ను గుజరాత్‌లో మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా ప్రారంభించింది.

* ప్రభుత్వ ఔషధ నియంత్రణదారుకు లంచాలు ఇచ్చిన ఆరోపణలపై సీబీఐ చేసిన పలు అరెస్టుల నేపథ్యంలో బయోకాన్‌ తన పాలన ప్రక్రియపై ఒక విస్తృత స్తాయి సమీక్షను బయటి సంస్థకు అప్పజెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని