నిధుల సేకరణకు మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ నిర్ణయం

సెమీకండక్టర్‌, ఎంబెడెడ్‌ డిజైన్‌ విభాగాల్లో సేవలు అందిస్తున్న మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ పద్ధతిలో కేటాయించి రూ.11 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ.61.05 ధరకు ఇవ్వాలని

Published : 06 Jul 2022 03:43 IST

రూ.61.05 ధరకు షేర్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: సెమీకండక్టర్‌, ఎంబెడెడ్‌ డిజైన్‌ విభాగాల్లో సేవలు అందిస్తున్న మాస్‌చిప్‌ టెక్నాలజీస్‌ ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ పద్ధతిలో కేటాయించి రూ.11 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ.61.05 ధరకు ఇవ్వాలని బోర్డు డైరెక్టర్ల సమావేశం నిర్ణయించింది. దీని ప్రకారం స్మైలెక్స్‌ కార్పొరేట్‌ సర్వీసెస్‌ అనే సంస్థకు    18.01 లక్షల షేర్లు కేటాయిస్తారు. ప్రమోటర్ల తరగతికి చెందిన మయూకా హోల్డింగ్స్‌ అనే సంస్థ నుంచి తీసుకున్న అప్పులో రూ.19 కోట్లను ఈక్విటీగా మార్చుతూ, అందుకు 31.12 లక్షల షేర్లు జారీ చేస్తారు. దీనివల్ల కంపెనీకి ఉన్న నికర అప్పు రూ.62.50 కోట్ల నుంచి రూ.32.50 కోట్లకు తగ్గుతుందని కంపెనీ వెల్లడించింది. ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌కు వాటాదార్ల అనుమతి తీసుకోవడం కోసం వచ్చే నెల 3న ఈజీఎం (వాటాదార్ల అసాధారణ సమావేశం) నిర్వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని