Go Firts: గో ఫస్ట్‌ విమాన సర్వీసులు రద్దు పొడిగింపు

గోఫస్ట్ (Go First) విమానయాన సంస్థ మరోసారి సర్వీసుల రద్దును మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. 

Published : 05 May 2023 23:53 IST

దిల్లీ: ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విమానయాన సంస్థ గో ఫస్ట్‌ (Go First) విమానయాన సంస్థ ఈ నెల 12 వరకు విమాన సర్వీసుల (Flight Services)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. నిర్వహణపరమైన కారణాలతో సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. తొలుత 3, 4, 5 తేదీల్లో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత విమాన సర్వీసుల రద్దును మే 9 వరకు పొడిగించింది. తాజాగా మే 12 వరకు సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. 

‘‘నిర్వహణపరమైన కారణాల వల్ల సర్వీసులను రద్దు చేస్తున్నాం. మే 12 వరకు షెడ్యూల్‌ చేసిన గో ఫస్ట్‌ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నాం. టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి మొత్తం తిరిగి చెల్లిస్తాం’’ అని ట్విటర్‌లో పేర్కొంది. మరోవైపు మే 15 వరకు కొత్త టికెట్ల విక్రయాలను గోఫస్ట్‌ నిలిపివేసిందని డీజీసీఏ (DGCA) తెలిపింది. గోఫస్ట్‌ ప్రమోటర్‌ వాడియా గ్రూప్‌ స్వచ్ఛందం దివాలా ప్రక్రయ కోసం జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (NCLT)లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ రామలింగం సుధాకర్‌ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బెంచ్‌ గురువారం తన ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని