NITI Aayog: సంపదను సృష్టించడమే ప్రైవేటు రంగం పని..!

సంపదను సృష్టించడమే ప్రైవేటు రంగం పని అని.. ప్రభుత్వం మాత్రం విధానాల రూపకల్పనపైనే దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు.

Published : 19 May 2022 18:57 IST

విధాన రూపకల్పనపైనే ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలన్న నీతి ఆయోగ్‌ సీఈఓ

దిల్లీ: సంపదను సృష్టించడమే ప్రైవేటు రంగం పని అని.. ప్రభుత్వం మాత్రం విధానాల రూపకల్పనపైనే దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. గవర్నమెంట్‌ టెక్‌ సమ్మిట్‌ 2022లో పాల్గొన్న ఆయన.. భారత్‌కు సమర్థమంతమైన, పారదర్శక ప్రభుత్వం అవసరమని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో పురోగతి, ఆయా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిపుణులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

‘పబ్లిక్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడమే ప్రభుత్వ విధిగా ఉండాలి. సంపదను సృష్టించడం ప్రైవేటు రంగం బాధ్యతే. అయితే, ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి ఇతర విషయాల్లో మాత్రం ప్రభుత్వ బాధ్యత ఉండాలి’ అని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. ఇక డిజిటల్‌ ఆర్థికవ్యవస్థపై మాట్లాడిన ఆయన.. దేశంలో అతి ముఖ్యమైన పరివర్తన ఐన డిజిటలైజేషన్‌ కీలక దశకు చేరుకుందన్నారు. ఈ పరివర్తన ప్రక్రియ ప్రయాణం ఇంకా కొనసాగుతోందని అన్నారు.

ఒకవేళ భారత్‌ తూర్పు ప్రాంతాలను పూర్తిగా డిజిటలైజ్‌ చేసి, పాలనను మరింత సులభతరం చేస్తే.. అప్పుడు ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రతిస్పందన మరింత పెరుగుతుందని అమితాబ్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఖనిజ వనరులతో నిండి ఉన్న ఈ రాష్ట్రాల్లో మరింత పరివర్తన అవసరమన్నారు. సుపరిపాలన అందించాలంటే సమాచార ఆధారిత పాలన ఎంతో కీలకమని నీతి ఆయోగ్‌ సీఈఓ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు