SSY Account Transfer: సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాను బ్యాంకు నుంచి పోస్టాఫీసుకి బ‌దిలీ చేసుకోవ‌చ్చా?

ఖాతా బ‌దిలీ కోసం అభ్య‌ర్ధించేంద‌కు ముందే బ‌దిలీ ప్ర‌తాల‌ను కొత్త బ్యాంకు చిరునామాకు నేరుగా పంపిస్తారా.. లేక మీకు అంద‌జేస్తారా అనేది తెలుసుకోవాలి. 

Published : 14 May 2022 14:29 IST

ఆడ‌పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం ప్రభుత్వం అందిస్తున్న ప‌థకం సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌. 10 ఏళ్ల లోపు ఆడ‌పిల్ల‌లు ఉన్న త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల కోసం ఈ ఖాతాను పోస్టాఫీసు/నిర్ధిష్ట‌ బ్యాంకుల్లో గానీ తెర‌వ‌చ్చు.  అదేవిధంగా బ్యాంకు నుంచి పోస్టాఫీసుకు గానీ, పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు గానీ, ఒక బ్యాంకు నుంచి మ‌రొక బ్యాంకుకు గానీ బ‌దిలీ చేసుకోవ‌చ్చు. 

ఒక పోస్టాఫీసు నుంచి మ‌రొక పోస్టీఫీసుకు ఖాతాను ఉచితంగానే బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ పోస్టాఫీసు నుంచి బ్యాంకుకు బ‌దిలీ చేసుకుంటే రూ. 100 బ‌దిలీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదిలో ఒక‌సారి ఖాతాను బ‌దిలీ చేసుకునేందుకు వీలుంటుంది.  ఒక‌వేళ మీరు కూడా ఖాతా బ‌దిలీ చేసుకునేందుకు చూస్తున్నారా? అయితే ప్రాసెస్‌ను తెలుసుకోండి. 

ఎస్ఎస్‌వై ఖాతాను బ‌దిలీ చేసుకునే విధానం..
* ఖాతా బ‌దిలీ కోసం ముందుగా మీరు ఖాతా తెరిచిన బ్యాంక్ బ్రాంచ్‌ లేదా పోస్టాఫీసుకి వెళ్లి ట్రాన్స్‌ఫారం కోసం అభ్య‌ర్ధించాలి. బ్యాంకు/పోస్టాఫీసు వారు మీకు బ‌దిలీ ఫారం ఇస్తారు. దాన్ని పూర్తి చేయాలి. 

* బ‌దిలీ ఫారం పూరించే స‌మ‌యంలో.. ఖాతా బ‌దిలీ చేయ‌బోయే బ్యాంక్/పోస్టాఫీసు పేరు, చిరునామా తప్పనిసరిగా అభ్య‌ర్ధ‌న‌ ఫారమ్‌లో పేర్కొనాలి.

* ఆ త‌ర్వాత పూర్తి చేసిన‌ అభ్య‌ర్ధ‌న పారంతో పాటు పాస్‌బుక్‌ను కూడా స‌మ‌ర్పించాలి. ఖాతా బ‌దిలీ కోసం ఒరిజిన‌ల్ పాస్‌బుక్‌ను అంద‌జేయ‌డం త‌ప్ప‌నిస‌రి. 

* మీ ప్ర‌స్తుత‌ బ్యాంక్/పోస్టాఫీసు.. మీరు స‌మ‌ర్పించిన అభ్య‌ర్థ‌న ఫారం, ఇత‌ర ప‌త్రాల‌ను ధృవీక‌రించి, ఖాతా బ‌దిలీ ప్రాసెస్ చేస్తుంది. ఆ బ్యాంకులో ఖాతాను మూసివేసి, సంబంధిత అన్ని ప‌త్రాల‌ను (ఎస్ఎస్‌వై ఖాతాలో ఉన్న అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ సంబంధించిన చెక్‌/డిడి తో స‌హా) మీరు అభ్య‌ర్థ‌న ఫారంలో నింపిన కొత్త బ్యాంక్ అడ్ర‌స్‌కు పంపిస్తుంది. ఒక్కోసారి క‌స్ట‌మ‌ర్‌కు అంద‌జేస్తుంది. 

* అందువ‌ల్ల ఖాతా బ‌దిలీ కోసం అభ్య‌ర్ధించేంద‌కు ముందే బ‌దిలీ ప్ర‌తాల‌ను కొత్త బ్యాంకు చిరునామాకు నేరుగా పంపిస్తారా.. లేక మీకు అంద‌జేస్తారా అనేది తెలుసుకోవాలి. 

* ఒక‌వేళ మీ ప్ర‌స్తుత బ్యాంకు బ‌దిలీ ప‌త్రాల‌ను నేరుగా కొత్త బ్యాంకు చిరునామాకు పంపిస్తే..  కొత్త బ్యాంకు సంబంధిత‌ ఒరిజిన‌ల్ ప‌త్రాలు (ఖాతా తెరిచిన‌ప్పుడు చేసిన ద‌ర‌ఖాస్తు ఫారం, అక్కౌంట్ స్టేట్‌మెంట్ సర్టిఫైడ్ కాపి, స్పైసిమెన్ సిగ్నేచ‌ర్‌, అప్‌డేట్ చేసిన ఒరిజిన‌ల్ పాస్‌బుక్‌, ఖాతా అవుట్స్టాండ్ బ్యాలెన్స్ చెక్‌/డిడి) చేరిన త‌ర్వాత, ఖాతా తెరిచి సంబంధిత కొత్త పాస్బుక్‌ను ఖాతాదారునికి అంద‌జేస్తుంది. కొన్ని బ్యాంకులు కొత్త ద‌రఖాస్తు ఫారంతో పాటు కేవైసీ ప‌త్రాల‌ను కోర‌వ‌చ్చు. 

* ఒక‌వేళ ప‌త్రాల‌ను క‌స్ట‌మ‌ర్‌కు అంద‌జేస్తే ఈ ప‌త్రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా మీరు ఖాతా బ‌దిలీ చేయాల‌నుకున్న‌ కొత్త బ్యాంక్/పోస్టాఫీసుకు స‌మ‌ర్పించాలి.  కొత్త బ్యాంక్/పోస్టాఫీసుకి ఖాతా బ‌దిలీ కోసం మ‌రోసారి ద‌ర‌ఖాస్తు ఫారంను నింపాలి. ఇది బ్యాంక్/పోస్టాఫీసు వ‌ద్ద ల‌భిస్తుంది. ద‌ర‌ఖాస్తు ఫారంతో పాటు కేవైసీ ప‌త్రాలు, ఫోటోగ్రాఫ్‌, న‌మునా సంత‌కాన్ని స‌మ‌ర్పించాలి. ఈ ప్రాసెస్ అంతా పూర్తిచేసిన త‌ర్వాత కొత్త బ్యాంక్ ఖాతాదారుని వివ‌రాల‌తో కొత్త పాస్‌బుక్‌ని జ‌న‌రేట్ చేస్తుంది. 

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా తెరిచేందుకు కావాల్సిన ప‌త్రాలు..
* ఖాతాదారుని ఫోటోగ్రాఫ్‌
* గార్డియ‌న్ ఆధార్ కార్డ్‌
* గార్డియన్ పాన్ కార్డ్‌
* పాప జ‌న్మ న‌మోదు ప్ర‌తం
* కేవైసి ప‌త్రాలు (గార్డియ‌న్ గుర్తింపు ప‌త్రం, చిరునామ ఫ్రూప్ మొద‌లైన‌వి).

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని