ఉమ్మ‌డి గృహ రుణం మంచిదేనా ?

ఇంటిని కొత్త‌ది నిర్మించాల‌న్నా, కొనాల‌న్నా.. ఇంటిని సొంతం చేసుకోవ‌డ‌మ‌నేది అధిక వ్య‌యంతో కూడుకున్న‌ది. దీనికి గృహ రుణం తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం, ఈ రోజుల్లో గృహ రుణం తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అవుతుంది కూడా. వ్య‌క్తులు తీసుకునే రుణాల్లో కూడా గృహ రుణ‌మే అతిపెద్ద‌ది. దీనికి కుటుంబ స‌భ్యుల‌ స‌పోర్ట్ కూడా చాలా అవ‌స‌రం. గృహ రుణాన్ని విడిగా కాకుండా ఉమ్మ‌డిగా కూడా తీసుకోవ‌చ్చు. ఉమ్మ‌డి గృహ రుణం విష‌యంలో ప్ల‌స్‌లు, మైన‌స్‌లు ఉంటాయి. ఉమ్మ‌డి గృహ రుణం తీసుకునే ముందు అంచ‌నా వేయాల్సిన‌వి కొన్ని ఉన్నాయి. స‌హ గ్యారెంట‌ర్‌ని క‌లిగి ఉండ‌టం వల్ల అధికంగా రుణం వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఉన్న‌ప్ప‌టికీ, గృహ‌ కొనుగోలుదారు ఉమ్మ‌డి గృహ రుణాన్ని పొంద‌డం వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

అవసరార్ధం ఉమ్మ‌డి గృహ రుణాన్ని పొంద‌డం ద్వారా ఇంటిని కొనుగోలు చేయ‌డం ఒక మంచి ఆలోచ‌న‌గానే అనిపిస్తుంది. ఇది రుణ చెల్లింపుపై భారాన్ని త‌గ్గిస్తుంది. మీ జీవిత భాగ‌స్వామితో క‌లిపి రుణం తీసుకోవ‌డం ద్వారా మీరు అన్ని సౌక‌ర్యాలున్న అధిక ధ‌ర ఇంటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్త్రీల‌కు రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌పై రాయితీల‌ను కూడా ఇస్తున్నాయి. సాధార‌ణంగా బ్యాంకులు కూడా స‌హ‌-ధ‌ర‌ఖాస్తుదారు, స‌హ‌-య‌జ‌మానిగా ఉండాల‌ని సూచిస్తున్నాయి. ఉమ్మ‌డి గృహ రుణం ధ‌ర‌ఖాస్తుదారులిద్ద‌రికీ పూర్తి బాధ్య‌త‌తో వ‌స్తుంది. వారిలో  ప్ర‌తి ఒక్క‌రు త‌న షేర్‌ని చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మ‌డి గృహ రుణంతో మీ క్రెడిట్ స్కోర్ మెరుగుప‌డ‌న‌ప్ప‌టికీ, భాగ‌స్వామి త‌న రుణ వాటాను చెల్లించ‌డానికి నిరాక‌రిస్తే, అది ఇద్ద‌రి క్రెడిట్ స్కోర్‌ని ప్ర‌భావితం చేస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం,  చెల్లింపుల్లో డిఫాల్ట్స్‌ ఎక్కువ భాగం స‌హ‌-దర‌ఖాస్తుదారుల‌తో జ‌రుగుతాయి. ఇద్ద‌రిలో ఎవ‌రైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నా డిఫాల్ట్ అయ్యే అవ‌కాశాలుంటాయి. ఇది ఇద్ద‌రి క్రెడిట్ స్కోర్‌కు భ‌విష్య‌త్తులో ఇబ్బందులు క‌లిగే అవ‌కాశముంది. ఒక భాగ‌స్వామికి గృహ రుణాన్ని అందించి, ఇత‌ర భాగ‌స్వామిని రుణ ర‌హితంగా ఉంచి, అవ‌స‌ర‌మైతే కొత్త రుణం (విద్యా రుణం) లాంటివాటికి వాళ్ల‌ను రిజ‌ర్వ్ చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఉమ్మ‌డి గృహ రుణం పొందిన త‌ర్వాత భ‌విష్య‌త్తులో భాగ‌స్వామితో విడిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటే రుణాన్ని తిరిగి చెల్లించ‌డం స‌మ‌స్య‌గా మారుతుంది. ఎందుకంటే రుణ దర‌ఖాస్తుదారులంద‌రూ బ‌కాయి ఉన్న మొత్తాన్ని చెల్లించ‌డానికి స‌మానంగా బాధ్య‌త వ‌హిస్తారు. ఉదాః విడాకుల త‌ర్వాత జీవిత భాగ‌స్వాముల్లో ఒక‌రు ఈఎమ్ఐలు చెల్లించ‌డం మానివేస్తే, తిరిగి చెల్లించే భారం ఇత‌ర దర‌ఖాస్తుదారుపై ప‌డుతుంది. దర‌ఖాస్తుదారు మొత్తం ఆస్తిపై యాజ‌మాన్యాన్ని పొంద‌కుండానే ఈఎమ్ఐల‌ను చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. ఈ విష‌యం ముఖ్యంగా గ‌మ‌నించుకోవాలి. అలాగే రుణం చెల్లించ‌డంలో ఇబ్బందుంటే రుణ‌గ్ర‌హీత‌ల ఇద్ద‌రికీ చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అందువ‌ల్ల భార్యా-భ‌ర్త‌లు ఉమ్మ‌డిగా ఇంటిని కొనుగోలు చేసే ముందు నిపుణుల స‌హాయం తీసుకుంటే మంచిది.

దురదృష్టవశాత్తు జీవిత భాగ‌స్వాముల్లో ఒక‌రు మ‌ర‌ణిస్తే, బ‌కాయి చెల్లింపును క్లియ‌ర్ చేసే భారం జీవించి ఉన్న భాగ‌స్వామిపై ప‌డుతుంది. రుణం తిరిగి చెల్లించ‌ని ప‌క్షంలో నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం బ్యాంకులు స‌హ‌-ధ‌ర‌ఖాస్తుదారు ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంటారు. కాబట్టి, రుణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని సరిపడా జీవిత బీమా తీసుకోవడం మంచిది.

ఉమ్మ‌డి రుణం విష‌యంలో, ఈఎమ్ఐల‌ను ఎవ‌రు చెల్లించార‌నే దానితో సంబంధం లేకుండా ఇంటి యాజ‌మాన్యం స‌మానంగా విభ‌జించ‌బ‌డుతుంది. అలాగే, ఒక‌రి క‌న్నా ఎక్కువ య‌జ‌మానులు ఉన్న‌ప్పుడు, స‌హ‌-య‌జ‌మానులు ఇద్ద‌రూ విక్ర‌యించ‌డానికి అంగీక‌రించే వ‌ర‌కు ఇంటి ఆస్తిని విక్ర‌యించ‌డం క‌ష్టం.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని