ఎప్పుడో చేయించుకున్న బీమా ఇప్ప‌టికీ స‌రిపోతుందా ?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవ‌రైనా జీవితానికి బీమా చేయించుకోవ‌డానికి ముఖ్య కార‌ణం వారు అక‌స్మిక మ‌ర‌ణిస్తే.. త‌ర్వాత భార్య, పిల్ల‌లు, త‌న‌పై ఆధార‌ప‌డిన త‌ల్లిదండ్రులు రోడ్డున ప‌డ‌కూడ‌దని. కానీ బీమా చేయించుకునేట‌పుడు త‌న ఆర్థిక ప‌రిస్థితి త‌క్కువ స్థాయిలో ఉండ‌టం కార‌ణం చేత లేక భ‌విష్య‌త్‌ ఖ‌ర్చుల‌ను స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక‌పోవ‌డం కార‌ణంచేత‌ బీమా మొత్తం త‌క్కువ ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. ఇటువంటి బీమా చివ‌రి వ‌ర‌కూ కొన‌సాగిస్తే అనుకోని విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అత‌డిపై ఆధార‌ప‌డిన కుటుంబం ఇబ్బందులు పాల‌వుతుంది.

ఒకరు తన కెరీర్ మొదట్లో ఒక పాలసీ కొనుగోలు చేశారనుకుందాం. అందులో కొన్ని ఫీచ‌ర్లు అన‌వ‌స‌రంగా ఉండ‌ట‌మే కాకుండా, పాల‌సీదారు త‌న ఉద్యోగ‌ జీవితంలో మ‌ధ్య‌లోకి వ‌చ్చే స‌మ‌యానికి హామీ ఇచ్చిన  బీమా మొత్తం ఏ మాత్రం స‌రిపోదు. పాల‌సీదారు మ‌ర‌ణించిన త‌ర్వాత కుటుంబానికి వ‌చ్చిన మొత్తం చూసుకుంటే పాల‌సీలు ఏ ప్ర‌యోజ‌నం కోసం కొనుగోలు చేస్తామో వ‌చ్చే సొమ్ములు కుటుంబానికి ఆ ప్ర‌యోజ‌నానికి ఏ మాత్రం స‌రిపోవు. కాబ‌ట్టి కెరీర్‌లోని వివిధ ద‌శ‌ల్లో పాల‌సీదారులు భ‌విష్య‌త్‌  అవ‌స‌రాల‌ను విశ్లేషించ‌డం చాలా మంచిది. ఒక వ్య‌క్తి జీవితంలో వివిధ ద‌శ‌ల్లో త‌న‌పై ఆధార‌ప‌డే వారికి అనుకూలంగా ఉండ‌టానికి అద‌న‌పు బీమా తీసుకోవ‌డం మంచిది.

10-15 సంవ‌త్స‌రాల క్రితం మ‌ధ్య ఆదాయ త‌ర‌గ‌తిలో ఉన్న వ్య‌క్తికి త‌గిన ర‌క్ష‌ణ కోసం రూ. 15-20 ల‌క్ష‌ల మొత్తంతో జీవిత బీమా పాల‌సీ సరిపోయి ఉండొచ్చు.  కానీ, నేడు పాల‌సీదారు మ‌ర‌ణిస్తే బ‌కాయిలు ఉన్న రుణ బాధ్య‌త‌లు తీర్చ‌డానికి కూడా ఈ మొత్తం స‌రిపోదు. కొవిడ్ ప‌రిస్థితుల్లో త‌మ కుటుంబ స‌భ్యుల‌ను కోల్పోయిన వారి ఇటీవ‌ల అనుభ‌వాలు జీవిత బీమా ఆలోచ‌న‌పై అనేక ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తాయి. సంపాదించే వ్య‌క్తి మ‌ర‌ణం త‌ర్వాత చాలా మంది బాధితులు, క్రెడిట్ కార్డ్ బ‌కాయిలు లేదా నిర్దిష్ట వినియోగ వ‌స్తువుల కోసం ‘ఈఎంఐ’ చెల్లించ‌డానికి, గృహ రుణం లేదా కారు లోన్‌ తిరిగి చెల్లించ‌లేక కుటుంబాన్ని పూర్తిగా నిస్స‌హాయ స్థితిలోకి నెట్టిన సంద‌ర్భాలున్నాయి. క్లెయిమ్‌ల రూపంలో త‌మ‌కు వ‌చ్చిన డ‌బ్బు స‌రిపోక‌పోవ‌డంతో బీమాతో నిరాస‌క్త‌త చెందుతున్నారు. 10 నుంచి 15 సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా పాల‌సీ క‌వ‌ర్‌పై స‌మీక్ష జ‌ర‌ప‌క‌పోవ‌డం స‌రైన చ‌ర్య‌కాదు. వ్య‌క్తులు త‌దుప‌రి 15 సంవ‌త్స‌రాల పాటు బాధ్య‌త‌ల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి ఆన్‌లైన్‌లో ట‌ర్మ్ ప్లాన్‌ను కొనుగోలు చేయ‌డం మంచిది. ట‌ర్మ్ బీమాలో త‌క్కువ బీమా ప్రీమియంకు ఎక్కువ క‌వ‌రేజ్ వ‌చ్చేలా బీమా పాల‌సీలు ఉంటాయి.

ఆర్థిక బాధ్య‌త‌లు, రుణాలు, ప్ర‌త్యేకంగా గృహ‌, వాహ‌న రుణాల ద్వారా ఏర్ప‌డిన ఆర్థిక బాధ్య‌త‌ల‌ను అంచ‌నా వేయాలి. జీవిత భాగ‌స్వామి, వారి పిల్ల‌లు ఆర్ధికంగా స్వ‌తంత్రం పొందేవ‌ర‌కు వారి ఆర్థిక అవ‌స‌రాల‌ను అంచ‌నా వేయాలి. ఇటువంటి బాధ్య‌త‌ల‌ను తీర్చ‌డానికి కుటుంబానికి అవ‌స‌ర‌మైన నిధి అందించ‌గ‌ల జీవిత బీమా పాల‌సీల‌ను ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. మీరు మొద‌టి పాల‌సీతో సౌక‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ అధిక హామీ మొత్తం కోసం మ‌రొక పాల‌సీని కొనుగోలు చేయ‌డం ద్వారా క‌వ‌రేజీని పెంచుకోవచ్చు. చాలా మందికి త‌మ కంపెనీ య‌జ‌మానులు ఎంప్లాయ‌ర్ ఫండెడ్ స్కీమ్‌ల ద్వారా త‌గిన లైఫ్ క‌వ‌రేజీని అందిస్తున్నార‌ని భావిస్తే.. అటువంటి సంద‌ర్భాల్లో ఏ విధ‌మైన ర‌క్ష‌ణ ప్ర‌యోజ‌నాన్ని అందించ‌ని పాత పాల‌సీని స‌రెండ‌ర్ చేయొచ్చు.

జీవిత బీమా అనేది దీర్ఘకాల ఒప్పందం లాంటిది. అయినా ఇది ఏటా రెన్యువల్‌ చేస్తుండాలి. ఎప్పుడైనా మీరు దీన్ని ఆపొచ్చు. లేదా దీనితో పాటు మరో పాలసీ అదనంగా కొనుగోలు చేయొచ్చు. పాలసీ ఎంచుకునే సమయంలో కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి, వారి సేవలు, ప్రీమియం లాంటి అనేక విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. సమయానుసారంగా బీమా మొత్తాన్ని సమీక్షిస్తుండడం మేలు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని