ఎలాన్‌ మస్క్‌కు అదర్‌ పూనావాలా సలహా.. బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇదేనట!

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కు (Elon Musk) సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అదర్‌ పూనావాలా (Adar Poonawalla) సలహా ఇచ్చారు.

Published : 08 May 2022 17:16 IST

దిల్లీ: స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌కు (Elon Musk) సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈవో అదర్‌ పూనావాలా (Adar Poonawalla) సలహా ఇచ్చారు. భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కోసం పెట్టుబడి పెట్టాలని సూచించారు. తాను సూచించే అత్యుత్తమ పెట్టుబడి మార్గం ఇదేనంటూ పేర్కొన్నారు. ట్విటర్‌ కొనుగోలుకు మస్క్‌ ముందుకొచ్చిన నేపథ్యంలో అదర్‌ ఆదివారం ఆయనను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

‘‘హే ఎలాన్‌ మస్క్‌... ఒకవేళ ట్విటర్‌ కొనుగోలు ఇంకా పూర్తి కాకపోయి ఉంటే భారత్‌లో టెస్లా కార్ల తయారీ చేపట్టడానికి పెట్టుబడి పెట్టండి. మీరు చేసే అత్యుత్తమ పెట్టుబడి ఇదే అవుతుంది. ఈ విషయంలో నాది గ్యారెంటీ’’ అంటూ అదర్‌ పూనావాలా ట్వీట్‌ చేశారు.

వాస్తవానికి భారత్‌లో కార్ల తయారీకి టెస్లా ఎప్పుడో ముందుకొచ్చింది. అయితే, ముందుగా దిగుమతి చేసిన కార్లు ఇక్కడ విజయవంతం అయితేనే తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతామని మస్క్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్‌లో దిగుమతి సుంకం అధికంగా ఉండడంతో సుంకాలు తగ్గించాలని ప్రభుత్వాన్ని మస్క్‌ కోరారు. ప్రభుత్వం అందుకు విముఖత వ్యక్తం చేయడంతో తయారీ దిశగా ముందడుగు పడలేదు. టెస్లా గురించి కేంద్రమంత్రి గడ్కరీ గత నెల స్పందించారు. దేశంలో కావాలంటే టెస్లా కార్లు తయారు చేసుకోవచ్చుగానీ, చైనా నుంచి దిగుమతికి మాత్రం అనుమతించేది లేదని స్పష్టంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని