UTSAV Deposit: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. రేపే లాస్ట్‌ డేట్‌!

ఆగస్టు 15న ఎస్‌బీఐ తీసుకొచ్చిన ప్రత్యేక ఉత్సవ్‌ డిపాజిట్‌ గడువు అక్టోబరు 28తో ముగియనుంది. 1000 రోజుల కాలపరిమితితో 6.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది.

Published : 27 Oct 2022 17:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎస్‌బీఐ ‘ఉత్సవ్‌ డిపాజిట్‌’ పేరిట తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీం గడువు అక్టోబరు 28తో ముగియనుంది. తక్కువ కాలవ్యవధికి ఎక్కువ వడ్డీరేటుతో అధిక ఆదాయం పొందాలనుకునేవారికి ఇది ఓ సురక్షితమైన మదుపు మార్గమని బ్యాంకు అధికారులు తెలిపారు. సాధారణ ఎఫ్‌డీలతో పోలిస్తే దీంట్లో అధిక వడ్డీరేటును అందజేస్తున్నామన్నారు. ఇతర ప్రయోజనాలు కూడా ఉన్న నేపథ్యంలో ఖాతాదారులు ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ స్కీంను 75 రోజుల పాటు కొనసాగి రేపటితో ముగియనుంది.

ఫీచర్లు, ప్రయోజనాలు..

  • ఈ డిపాజిట్‌ కాలపరిమితి 1000 రోజులు
  • బ్యాంకు 6.10శాతం వడ్డీ ఇస్తుంది.
  • సీనియర్‌ సిటిజన్లకు మరో 0.50శాతం అధిక వడ్డీ లభిస్తుంది.
  • ఎన్‌ఆర్‌ఓతో పాటు అన్ని దేశీయ టర్మ్‌ డిపాజిట్లను ఉత్సవ్‌ డిపాజిట్‌ కిందకు మార్చుకోవచ్చు. కొత్త డిపాజిట్లతో పాటు పునరుద్ధరించే పాత డిపాజిట్లకు కూడా ఈ స్కీం వర్తిస్తుంది. అయితే, స్టాఫ్‌, సీనియర్‌ సిటిజన్ల ఎన్‌ఆర్‌ఓ డిపాజిట్లకు మాత్రం ఈ సదుపాయం లేదు.
  • మనం ఎంచుకున్న దాన్ని బట్టి నెల, మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం మన ఖాతాలో జమవుతుంది.
  • ఆదాయ పన్ను నిబంధన ప్రకారం టీడీఎస్‌ వర్తిస్తుంది.
  • సాధారణ డిపాజిట్లకు వర్తించే నిబంధనలే ఉత్సవ్‌ డిపాజిట్‌ ముందస్తు ఉపసంహరణకూ అమలవుతాయి.
  • ఈ డిపాజిట్‌పై రుణ సౌకర్యం కూడా ఉంది.
  • బ్యాంకు శాఖలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో యాప్‌ ద్వారా డిపాజిట్‌ను చేయొచ్చు.
  • ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లకు ఈ స్కీం వర్తించదు.

సాధారణ రిటైల్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ అందిస్తున్న వడ్డీరేటు వివరాలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని