మార్కెట్ల ఒడుదొడుకుల‌తో సిప్‌ల‌లో పెట్టుబ‌డులు కొన‌సాగించాలా? వ‌ద్దా

మార్కెట్ల‌లో ఒడుదొడుకుల కార‌ణంగా సిప్‌లలో పెట్టుబ‌డులు త‌గ్గుతున్నాయి​​​​​​....

Published : 21 Dec 2020 13:14 IST

మార్కెట్ల‌లో ఒడుదొడుకుల కార‌ణంగా సిప్‌లలో పెట్టుబ‌డులు త‌గ్గుతున్నాయి

22 మే 2018 మధ్యాహ్నం 2:25

క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల ప‌థ‌కాలు(సిప్‌)లు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో మొద‌టి నెల‌లోనే సిప్‌లో పెట్టిన పెట్టుబ‌డులు త‌గ్గాయనేది దాని సారాంశం. గ‌త కొద్ది కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటుండ‌టంతో మ‌దుప‌రులు సిప్‌లో పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు.

మ్యూచువ‌ల్ ఫండ్ల స‌మాఖ్య‌(యాంఫీ) ద‌గ్గ‌రున్న గ‌ణాంకాల ప్ర‌కారం దేశంలో మొత్తం 2.16 కోట్ల సిప్ ఖాతాల ద్వారా మ‌దుప‌రులు మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ఏప్రిల్ నెల‌లో సిప్‌ల‌లో మ‌దుప‌రులు రూ.6690 కోట్ల‌ను పెట్టుబ‌డిగా పెట్టారు. గ‌తేడాది ఇదే నెల‌లో సిప్‌లు ఆక‌ర్షించిన పెట్టుబ‌డులు రూ.7119 కోట్ల‌తో పోలిస్తే ఈ మొత్తం రూ.429 కోట్లు త‌క్కువ‌.

మార్కెట్ల‌లో ఒడుదొడుకులే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు త‌గ్గ‌డానికి కార‌ణ‌మ‌ని ఆర్థిక నిపుణుల అంటున్నారు. ఒక‌వేళ అదే నిజ‌మైతే, ఇప్పుడు మ‌దుప‌రులు ఏం చేయ‌నున్నారు వారు సిప్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ఆపేస్తారా లేదా మార్కెట్ల ఒడుదొడుకులు ఇలాగే కొన‌సాగినంత కాలం అంత దూకుడుగా వెళ్ల‌రా అయితే ఈ నిర్ణ‌యం తెలివైన‌దేనా

అయితే ఏప్రిల్ నెల‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన ఈ పెట్టుబ‌డుల గురించి అంత‌గా ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, ఇందుకు మార్కెట్ల ఒడుదొడుకులే గాక ఇత‌ర కార‌ణాల‌నున్నాయిని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ ఒడుదొడుకుల కోణంలో ఆలోచించి, కొంత‌మంది మ‌దుప‌రులు కొన్నిసార్లు ప్ర‌త్య‌క్షంగా లేదా సిప్‌ల ద్వారా స్టాక్ మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు. అయితే మార్చి, 2018 తో పోలిస్తే, ఏప్రిల్ నెల‌లో సిప్ పెట్టుబ‌డులు త‌గ్గ‌డాన్ని స‌హేతుకంగా ప‌రిశీలించాల్సి ఉంటుంది.

ఫిబ్ర‌వ‌రి నెల‌లో 30, 31 తేదీలు లేవు. ఇందువ‌ల్ల ఈ నెల‌లో సిప్ పెట్టుబ‌డులు త‌గ్గాయి. ఈ రెండు రోజుల పెట్టుబ‌డులు మార్చి, 2018 లో ప్ర‌తిబింబించడం కార‌ణంగా పెట్టుబ‌డులు పెరిగిన‌ట్లు క‌నిపించింది. అయితే ఏప్రిల్ నెల‌లో వ‌చ్చిన పెట్టుబ‌డులు సాధార‌ణ సంఖ్యేన‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
2016-17 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి నెల‌వారీగా సిప్‌ల‌లో పెట్టిన పెట్టుబ‌డులు

MF-SIP.png

ఇప్పుడు మ‌దుప‌రులు ఏంచేయాలి

ఆర్థిక నిపుణులు అభిప్రాయం ప్ర‌కారం, రిటైల్ మ‌దుప‌రులు త‌మ పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించారు. వారికి మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నాయా లేదా అన్న‌ది కాదు, త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌ను సాధించామా లేదా అన్న‌దే ముఖ్యం కావాల‌ని వారంటున్నారు. తాత్కాలిక ఒడుదొడుకుల‌ను చూసి సిప్‌ల‌ను కొన‌సాగించ‌క‌పోవ‌డం, నిన్న భారీ వ‌ర్షాలు ప‌డ్డాయ‌ని ఈ రోజు ఇంట్లో కూర్చోవ‌డం లాంటిద‌ని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్లు క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి ప‌థ‌కాలు స‌రిగ్గా స‌రిపోతాయి. ఇంత‌కుమించి మ‌న‌మేం చేయ‌లేం.

ప్ర‌శాతంగా ఉండి మ‌న ప‌నులు మ‌నం చేసుకుంటూ పోవాలి. తాత్కాలికంగా ఉన్న ఈ ప‌రిస్థితుల‌న చూసి ఆందోళ‌న‌కు గురి కావ‌ద్దు. ప్ర‌తీ రోజు నిక‌ర స‌గ‌టు విలువ‌ను ప‌రిశీలిస్తూ, రోజూ పెట్టుబ‌డుల విలువ‌న త‌రిచి చూస్తూ పోతే అస‌లైన అనుభవం ల‌భించ‌దు. ఇంత‌కంటే ఎక్కువ సంక్షోభాలు ఎదురైన 2008, 2011, 2015 సంవ‌త్స‌రాల్లో దీర్ఘ‌కాలం మ‌దుప‌రులు పెట్టిన వారేమైనా డ‌బ్బులు కోల్పోయారా లేదే. కాబ‌ట్టి ప్ర‌తీ రోజూ మార్కెట్ల‌ను ప‌రిశీలించ‌డం ఆపివేసి, దీర్ఘ‌కాలంలో మ‌దుపు చేయ‌డాన్ని కొన‌సాగించాలి. అధిక రాబ‌డుల‌నిస్తుంద‌ని మీరు మీ డ‌బ్బుపై విశ్వాసం ఉంచిన‌ప్పుడు,ఈ విష‌యాలేవీ ప‌ట్టించుకోకుండా మీ ప‌ని మీరు చేసుకుపోవాల‌ని ఆర్థిక నిపుణుడొక‌రు అన్నారు.

సిప్‌ల‌నేవి దీర్ఘ‌కాలంలో రాబ‌డుల‌నిచ్చే పెట్టుబ‌డి సాధ‌నాల‌ని ఆర్థిక నిపుణులు అంటున్నారు. స్టాక్ మార్కెట్ల‌లో ఏవైనా ఒడుదొడుకులు ఎదురైనా, అవి దీర్ఘ‌కాలంలో సిప్ పెట్టుబ‌డుల‌కు మేలే చేకూరుస్తాయి.

గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా, ముఖ్యంగా 2014 త‌ర్వాత కాలం ఈక్విటీ మ‌దుపరుల‌కు మంచి స‌మ‌యం. ఈ స‌మ‌యంలో మార్కెట్లు పెరిగినా త‌గ్గినా ఒక క్ర‌మమైన మార్గంలో చోటు చేసుకున్నాయి(కొన్ని నెల‌ల‌పాటు దిద్దుబాటు త‌ప్పించి). అయితే 2014 త‌ర్వాత మార్కెట్ల‌లోకి ప్ర‌వేశించిన వారికి ఇదొక కొత్త ప‌రిణామం. అలాంటి వారు ఈ ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు దీర్ఘ‌కాలం కొన‌సాగితే పెట్టుబ‌డుల విష‌యంలో వెనక్కి మ‌ళ్ల‌ట‌మే మంచిద‌ని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

మ‌దుప‌రుల ముందున్న మార్గం

పెట్టిన పెట్టుబ‌డులకు ఇప్ప‌టికీ అత్యుత్త‌మ మార్గం ఈక్విటీ మార్కెట్లేన‌ని ప‌రిశ్ర‌మ నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిలో పెట్టుబ‌డుల‌తో కూడిన మార్గం క‌ఠిన‌మైన‌ది, ఇది వారి ఓపిక‌ను ప‌రీక్షిస్తుంది. ఇలాంటి ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు మ‌దుప‌రులు త‌మ పెట్టుబడుల‌కు క‌ట్టిప‌డి ఉండాలి, భ‌యంతో లేదా అత్యాశ‌తో కూడిన నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు.

మ‌దుప‌రులు ఎవ‌రైతే రిస్క్ సామ‌ర్థ్యం క‌ల‌దో, వారు ఈక్విటీల‌లో గ‌ల త‌మ పెట్టేబ‌డుల‌ను మ‌రోసారి మ‌దింపు చేసుకోవాలి. స్మాల్, మిడ్ క్యాప్‌ల‌తో పోలిస్తే, లార్జ్ క్యాప్‌, ఇండెక్స్ ఫండ్ల‌లో ఒడుదొడుకులు త‌క్కువ‌. కాబ‌ట్టి మ‌దుప‌రులు త‌మ రిస్క్ ప్రొఫైల్ బ‌ట్టి, ఆర్థిక స‌ల‌హాదారుల వ‌ద్ద త‌గిన సూచ‌న‌లు తీసుకుని పెట్టుబ‌డులు పెట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని