Snapdeal IPO : త్వరలో ఐపీఓకి రానున్న స్నాప్‌డీల్...

ఇది దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పెద్ద ప్రత్యర్థులతో పోటీపడుతోంది

Updated : 22 Dec 2021 17:19 IST

సాఫ్ట్‌బ్యాంకు మద్దతుగల దేశీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం అయిన స్నాప్‌డీల్ బుధవారం ‘ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్-ఐపీఓ’ కోసం దరఖాస్తు చేసింది. సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు ఉన్న అనేక కంపెనీలు ఇటీవల ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. పేటిఎం, బ్యూటీ ఈ-కామర్స్ రిటైలర్ నైకా, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారం జొమాటో వంటి సంస్థలు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టి మంచి లిస్టింగ్ గెయిన్స్ ను పొందాయి. అయితే పేటిఎం లిస్టింగ్ గెయిన్స్‌ను పొందనప్పటికీ తరువాత మదుపరులకు మంచి రిటర్న్స్ ను అందిస్తోంది. ఇప్పుడు అదే జాబితాలో స్నాప్ డీల్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.  

డిసెంబర్ 20 నాటి డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ప్రకారం, స్నాప్‌డీల్ ఐపీఓ ద్వారా ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 1,250 కోట్లు విలువ చేసే షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 308 లక్షల షేర్లను విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారం స్నాప్‌డీల్‌ను 2010 సంవత్సరంలో కునాల్, రోహిత్ బన్సల్ కలిసి ప్రారంభించారు. ఇది దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి పెద్ద ప్రత్యర్థులతో బిజినెస్ పరంగా స్నాప్‌డీల్‌ పోటీపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని