Bengaluru: వ్యక్తిని హత్య చేసి.. పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి..!
కర్ణాటక రాజధాని బెంగళూరులో నలుగురు యువకులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అనంతరం అతడి శవాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి......
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో నలుగురు యువకులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అనంతరం అతడి శవాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి పోలీసులకు లొంగిపోయారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు భాస్కర్ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. ఓ వివాహిత సైతం అదే షాప్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే వారిమధ్య సాన్నిహిత్యం పెరిగి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సదరు మహిళ 15 రోజుల క్రితం పిల్లలతో కలిసి అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో భాస్కర్ శనివారం సాయంత్రం సదరు మహిళ ఇంటికి వెళ్లి ఆమెతోపాటు ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకువెళ్లేందుకు యత్నించాడు. పెద్ద కుమారుడు ససేమిరా అనడంతో ప్రియురాలితోపాటు ఆమె చిన్న కుమారుడిని తీసుకెళ్లాడు. అయితే పెద్ద కుమారుడు ఈ విషయాన్ని తన మేనమామ మునిరాజుకు తెలియజేశాడు. దీంతో మునిరాజు తన ముగ్గురు స్నేహితులతో కలిసి భాస్కర్ వెళుతున్న ఆటోరిక్షాను అడ్డుకున్నారు. తన సోదరి, అల్లుడిని అక్కడే దించేసి.. భాస్కర్‌ను ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారంతా కలిసి అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. భయాందోళనకు గురైన మునిరాజు విషయాన్ని తన తల్లికి తెలియజేశాడు. ఆమె సలహా మేరకు మృతదేహాన్ని నేరుగా పోలీసుస్టేషన్‌కు తరలించిన నిందితులు పోలీసు వద్ద లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఆఫ్టర్ 9’ పబ్‌పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ‘ఆఫ్టర్ 9’ పబ్‌పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. -
ప్రేమను అంగీకరించలేదని అమ్మకు విషం పెట్టిన యువతి
తన ప్రేమకు అడ్డుచెప్పారని కన్నతల్లి సహా కుటుంబసభ్యులను హతమార్చేందుకు ఓ యువతి చికెన్ రైస్‌లో విషం కలిపింది. ఆ అన్నం తిన్న యువతి తల్లి, తాత మరణించారు. -
బోగస్ బిల్లులతో రూ.45 కోట్లు కాజేశారు!
వాణిజ్య పన్నుల శాఖలో బోగస్ బిల్లులతో జీఎస్టీ రిఫండ్ పొందిన కేసులో తవ్వేకొద్దీ అవినీతి వ్యవహారం బయటపడుతోంది. -
కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకుడొకరు హత్యకు గురయ్యారు. పార్టీ ప్రచార సభ ఏర్పాట్లలో ఉన్న ఆయనపై ఒకరు కత్తితో దాడికి దిగి గొంతుకోసి హత్య చేశారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చోటు చేసుకుంది. -
గురుగ్రంథ్ సాహిబ్‌లో పేజీల చించివేత.. యువకుణ్ని కొట్టిచంపిన స్థానికులు
సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్‌లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. -
కుమారుణ్ని కొట్టిచంపి.. గోనెసంచిలో చుట్టి పడేశారు!
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో కుమారుణ్ని తల్లిదండ్రులే కొట్టిచంపి గోనెసంచిలో చుట్టి బయట పడేశారు. ఇందౌర్ విమానాశ్రయ పోలీస్‌స్టేషను పరిధిలో ఏప్రిల్ 26న గోనెసంచిలో చుట్టి ఉన్న మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు
రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్ఐఆర్లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. -
నూహ్ సామూహిక అత్యాచారాలు.. జంట హత్యల దోషులకు మరణ దండన
ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలిక సహా ఇద్దరిపై సామూహిక అత్యాచారం, జంట హత్యల కేసులో దోషులుగా తేలిన నలుగురు వ్యక్తులకు న్యాయస్థానం మరణ దండన విధించింది. -
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్‌లతో కొత్త మోసం!
Scam Alert : డిజిటల్ యుగంలో సైబర్ దాడులు పెరిగిపోతున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు పెద్దఎత్తున మోసాలకు తెర తీస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్‌పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్‌కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్